చాలా మందికి తినేటప్పుడు టీవీ లేదా మొబైల్ లో ఏదో వీడియోలను చూసుకుంటూ తినే అలవాటు ఉంటుంది.. అసలు ఉదయం లేచింది మొదలు చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఫోన్ కు బాగా అలవాటు పడ్డారు.. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఆండ్రాయిడ్ ఫోన్ లనే ఉపయోగిస్తున్నారు.. జీవితంలో ఒక భాగం అయిపోయాయి. మరి పిల్లలు అయితే స్మార్ట్ ఫోన్ లకి బానిసలు అయిపోతున్నారు. ప్రస్తుతం పిల్లలు ఫోన్ చూస్తూ అన్నం తింటున్నారు… పెద్దలు కూడా చేతిలో ఫోన్ పట్టుకొని అన్నం తింటున్నారు.. ఇలా తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..
పిల్లలు ఎక్కువగా స్మార్ట్ ఫోన్ చూస్తే, అది మెదడుపై ప్రభావం చూపిస్తుంది. సెల్ ఫోన్ చూసే పిల్లలు నలుగురిలో కంటే ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఎవరితో సరిగా మాట్లాడరు. ఇదే దీర్ఘకాలంలో ఇతర సమస్యలకు దారితీస్తుంది. పిల్లలు మొబైల్ చూస్తూ ఫోన్ తినడం వలన వాళ్ళు ఏది తింటున్నారో కూడా గమనించరు.. కొందరు ఫోన్ చూస్తూ ఎక్కువగా తింటారు.. ఇలా తినడం వల్ల ఉభకాయం వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు..
చిన్న పిల్లలు ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు చూస్తే కళ్ళు బలహీనంగా తయారవుతాయి. దీనివలన వాళ్ళు చిన్న వయసులోనే కళ్ళజోడు ధరించాల్సి ఉంటుంది. అంతేకాదు చిన్నప్పటినుంచి స్క్రీన్ దగ్గర ఉండి చూడటం వలన రెటీనా దెబ్బ తినే అవకాశం ఉంటుంది. అలాగే పిల్లలు ఫోన్ చూస్తూ అన్నం తినడం వలన తల్లి, బిడ్డల సంబంధం పై చెడు ప్రభావం పడుతుంది… అలా తిన్న ఆహారం కూడా త్వరగా జీర్ణం అవ్వదు.. అందుకే నిపుణులు తినేటప్పుడు పిల్లలకు ఫోన్లను దూరం పెట్టాలని చెబుతున్నారు.. పెద్దలు కూడా ఇది గుర్తుంచుకుంటే మంచిది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.