NTV Telugu Site icon

Health Tips : కీరదోస ఎక్కువగా తింటున్నారా? ఇది తప్పక తెలుసుకోవాలి..

Cucumber

Cucumber

ఏ సీజన్ లో అయిన దొరికే కాయలలో కీర దోస కూడా ఒకటి.. ఈ కాయలను ఆరోగ్యం, అందం కోసం వాడుతారు.. కీరదోసకాయను సలాడ్స్ లో ఎక్కువగా ఉపయోగించి తీసుకుంటుంటారు, దోసకాయను అందరూ పండు లేదా కూరగాయగా అని పిలుస్తుంటారు. ఈ కీరదోసకాయను ఎలా పిలిచినా ఇందులో ఉండే ప్రయోజనాలు మాత్రం వెలకట్టలేనివి.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి…శరీరాన్ని చల్లబరచడం నుండి మీ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వరకు, దోసకాయ మీకు వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.. మనలో చాలా మంది దోసకాయను యధాతథంగా తినడానికి ఇష్టపడతారు. దోసకాయ పొట్టు తీయకుండా తింటే మంచిదా? ఇది శరీరానికి సమస్యలను కలిగిస్తుందా? పొట్టును తొలగించి తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

వీటిలో నీటి శాతం అధికంగా ఉంటుంది.. పోషకాలు, ఖనిజాలు అధికంగా ఉంటాయి.. ఒక దోసకాయలో కేవలం 30 కేలరీలు మాత్రమే ఉంటాయి. సున్నా కొవ్వుతో పాటు ఫైబర్, విటమిన్ సి, పొటాషియం, మాంగనీస్ వంటి పోషకాలతో నిండి ఉంటుంది.. ఇందులో విటమిన్ k అధికంగా ఉంటుంది.. విటమిన్ K రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కీరదోసకాయలోని లిగ్నన్స్ ఆస్టియోపోరోసిస్, గుండె జబ్బులనే క్యాన్సర్ ను తగ్గించడంలో సహాయపడుతుంది..

కీరదోసకాయ పెరుగు రైతా ఉత్తర భారతీయ వంటకాలలో అత్యంత ప్రసిద్ధి చెందినది. తరిగిన దోసకాయలో పెరుగు, మసాలా, పచ్చిమిర్చి కలిపి వడ్డిస్తారు. మీరు దోసకాయను అలాగే తినవచ్చు. కీర దోసకాయ కూర ప్రసిద్ధ దక్షిణ భారత వంటకం. ఇది సుగంధ ద్రవ్యాలతో దోసకాయను వండడం ద్వారా తయారు చేయబడుతుంది. చాలా రిఫ్రెష్ మరియు కూలింగ్ దోసకాయ పానీయం వేసవిలో ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు.. ఎప్పుడు డిమాండ్ ఉండే ఈ కూరగాయను పండించడానికి రైతులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.. అందులో కాయలు బాగుండాలని రసాయనాలను కూడా స్ప్రే చేస్తారు.. అందువల్ల, దోసకాయలు పొట్టులో రసాయనాలు మరియు మురికిని కలిగి ఉండే అవకాశం ఉన్నందున, వాటిని పొట్టు లేదా పై తొక్కతో తినకూడదని నిపుణులు సలహా ఇస్తున్నారు.. ఇవే కాదు దుంపలు, కాయలను కూడా పొట్టు తీసి తినడం మేలు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.