NTV Telugu Site icon

Health Tips: ఆవాలతో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు..

Avalu

Avalu

Health Tips: మన వంట గదిలోని పోపుల డబ్బాలో ఎప్పుడూ ఉండే మసాలా దినుసుల్లో ఆవాలు ఒకటి. మనం చేసే ప్రతి వంటకంలోనూ ఆవాలు ఉపయోగిస్తాం. ఆవాలు కూరలకు చక్కని సువాసనను జోడించడంలో సహాయపడుతుంది. ఆవాలలో ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, వీటిని ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కావున ఆవాల వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం కూరల్లో ఆవాలను ఉపయోగించడం మాత్రమే కాకుండా పచ్చళ్లలో కూడా ఆవాలను పిండిగా చేసి వాడుతాం. ఆవాలను కూరల్లో, పచ్చడిలో వేసుకుని తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. హైబీపీ వున్నవారు ఆవాలు తీసుకోవడం వల్ల త్వరగా ఉపసమనం ఉంటుంది. ఆవాలు నిత్యం తీసుకోవడం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దగ్గు, జలుబు వంటి సమస్యలకు ఆవాలతో పరిష్కారం లభిస్తుంది. ఫినోలిక్‌ కాంపౌండ్స్‌, టోకో ఫేర్రోల్స్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ ఆవాలలో పుష్కలంగా ఉంటాయి.

Read also: Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌!

దీనివల్ల ఇన్ఫ్లమేషన్‌ ను తగ్గించడమే కాకుండా లివర్‌ పనితీరు మెరుగుపరుస్తాయి. ఆవాలు చర్మ ఆరోగ్యం, జుట్టు బలోపేతంగా ఉండేలా చేస్తాయి. ఏజింగ్‌, ముడతలు వంటి లక్షణాలను ఆవాలు దూరం చేసి యవ్వనంగా ఉండేలా చేస్తాయి. ఆవాలలో ఉండే పోషకాలు సోరియాసిస్‌ బారినుండి మనల్ని కాపాడుతాయి. మనకు ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌ దరిచేరకుండా చేస్తాయి. క్యాన్సర్‌ ను తగ్గించే గుణాలు కూడా ఆవాలలో ఎక్కువగా ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ కణాలను పెరగకుండా చేస్తాయి. మనల్ని క్యాన్సర్‌ వేధించకుండా కాపాడుతాయి. ఇందులో పొటాషియం, కాల్షియం ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా.. కీళ్ల ఆరోగ్యానికి దోహద పడతాయి. కావున ప్రతి ఒక్కరు రెగ్యులర్‌ గా ఆవాలు ఖచ్చితంగా ఆహారంలో భాగం చేసుకుంటూ చాలా మంచి ప్రయోజనాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Tirumala: శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి.. విచారణ ముమ్మరం చేసిన సిట్‌!