Site icon NTV Telugu

Brutally Beaten : ప్రియురాలు పిలిచింది.. కట్ చేస్తే ప్రాణాలు ఫట్

Kerala

Kerala

Brutally Beaten : ప్రియురాలు అర్ధరాత్రి ప్రేమతో పిలిచిందని కలిసేందుకు వెళ్లాడు. అక్కడే కాచుకుని కూర్చున్న గుంపు దారుణంగా కొట్టడంతో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన కేరళలోని త్రిసూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. వృత్తిరీత్యా బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్న అవివాహిత యువకుడు సహర్ అర్ధరాత్రి తన వివాహిత ప్రియురాలిని కలవడానికి వెళ్లాడు. వివాహిత ఇంటి సమీపంలోని గుడిదగ్గర మోరల్ పోలీసింగ్ పేరుతో కూర్చున్న ఓ గుంపు ఆ యువకుడిని మొదట విచారించింది. ఆ తర్వాత యువకుడిపై దారుణంగా దాడి చేశారు. ఈ ఘటన అంతా ఓ గుడి దగ్గర ఉన్న కెమెరాలో రికార్డయింది. ఈ షాకింగ్ సంఘటన ఫిబ్రవరి 18 న జరిగింది. గాయపడిన బస్సు డ్రైవర్ మంగళవారం త్రిసూర్ ఆసుపత్రిలో మరణించాడు. కిడ్నీలు, పక్కటెముకలకు తీవ్ర గాయాలు కావడంతో యువకుడు చికిత్స పొందుతూ మరణించాడని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ కేసులో పోలీసులు ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. కాగా, ఘటనానంతరం నిందితులు పరారీలో ఉన్నారు.

Read Also : Big Breaking: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. రేపు రాజధానికి రావాలని కవితకు ఈడీ నోటీసులు

కేరళలోని త్రిసూర్‌లో మోరల్ పోలీసింగ్ పేరుతో ఎనిమిది మంది ఓ గుడి దగ్గర కూర్చొన్నారు. ఇంతలో సహర్ అటుగా వెళ్తుండడం చూసి ఎవరికోసం వచ్చావంటూ విచారించారు. ఈ విచారణలో నిజం చెప్పాలంటూ వ్యక్తుల బృందం అతన్ని తీవ్రంగా కొట్టారు. ఆ దాడిలో అతడు సృహ తప్పి పోయాడు..
పోలీసులు మీడియాకు అందించిన సమాచారం ప్రకారం.. చెర్పుకు చెందిన ఈ యువకుడికి అర్ధరాత్రి తన ప్రియురాలి నుంచి కాల్ రావడంతో ఆమెను కలిసేందుకు వెళ్లాడు. వివాహిత ఇంటి దగ్గర కూర్చున్న ఓ గుంపు ఆ యువకుడిని మొదట విచారించి ఆ తర్వాత కాళ్లతో కొట్టి చంపింది. గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ కేసులో రాహుల్, బిజిత్, విష్ణు, బిను, అరుణ్, అభిలాష్‌లపై కేసు నమోదు చేశారు. గుడిలో యువకుడిని కిరాతకంగా కొట్టిన దృశ్యం రికార్డైంది. ఘటన అనంతరం ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. యువకుడిని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.

Exit mobile version