Longest Nose in the world : ప్రపంచంలో చాలా ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. వాటి గురించి విన్నప్పుడు మనం ఆశ్చర్యపోతాం. పొడవైన పురుషుడు, పొడవైన స్త్రీ ఇలాంటివి వినే ఉంటారు. ప్రపంచంలోనే అత్యంత పొడవుగా ముక్కు ఉన్న వ్యక్తి గురించి తెలుసుకుందాం. దాదాపు 300 ఏళ్లుగా ఆయన రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు. ఇది గిన్నిస్ బుక్‌లో కూడా నమోదైంది. ఈ వ్యక్తి ఎంత ప్రజాదరణ పొందాడు అంటే అతని మైనపు విగ్రహాన్ని లండన్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు.
Read Also: Burkina Faso: బుర్కినా ఫాసోలో నరమేధం..40 మందిని చంపిన ఉగ్రవాదులు..
ఈ వ్యక్తి పేరు థామస్ వాడేహౌస్. వాడేహౌస్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన ముక్కును కలిగి ఉన్నాడు. ఆయన ఫోటోలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతని చిత్రాన్ని ట్విట్టర్‌లో @pubity అకౌంట్ ద్వారా షేర్ చేశారు. దీనితో పాటు అతని వివరాలను కూడా వివరించారు. దాని ప్రకారం థామస్ వాడ్‌హౌస్ 18వ శతాబ్దానికి చెందిన సర్కస్ ప్రదర్శనకారుడు. అతను 7.5 అంగుళాల పొడవైన అతిపెద్ద ముక్కును కలిగి ఉన్నాడు. థామస్ వాడేహౌస్ ఇంగ్లండ్‌లో నివసించాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వెబ్‌సైట్‌లో ఈ వ్యక్తి గురించి ఒక పేజీ కూడా ఉంది. వారి గురించిన సమాచారం అక్కడ ఇవ్వబడింది. థామస్ వాడ్‌హౌస్ 1770లలో ఇంగ్లండ్‌లో నివసించాడని.. సర్కస్‌లో పనిచేశాడని రాశారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటో లండన్‌లోని రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ మ్యూజియంలోనిది. అతని మైనపు విగ్రహం అక్కడ ఏర్పాటు చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. అంత పొడవాటి ముక్కును చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
అయితే, జీవించి ఉన్న వారి విషయంలో పొడవైన ముక్కు రికార్డు టర్కీకి చెందిన మెహ్మెట్ ఓజురెక్ పేరు మీద ఉంది. ఈ రికార్డును రెండు సంవత్సరాల క్రితం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ధృవీకరించింది. అతని ముక్కు పొడవు 3.46 అంగుళాలు.
