రీమేక్ అని ఎప్పటి నుండో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. దలపతి విజయ్ నటిస్తున్న భారీ చిత్రం జననాయకన్. హెచ్ వినోద్ దర్శకత్వం ఈ సినిమాను తెలుగులో జాననాయకుడుగా తీసుకువస్తున్నారు. అయితే ఈ సినిమా తెలుగులో నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన హిట్ సినిమా భగంవంత్ కేసరికి అఫీషియల్ రీమేక్ అని ఇటీవల సోషల్ మీడియాలో రీమేక్ రూమర్లు పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. అందుకుతోడు జననాయగన్ నుండి వస్తున్న పోస్టర్స్ కూడా భగవంత్ కేసరి సినిమాను పోలిఉండడంతో సోషల్ మీడియాలో ఈ వాదన ఎక్కువ అయింది.
Also Read : Jananayagan : తమిళ చిత్ర పరిశ్రమలో ఒక శకం ముగిసింది.. స్టార్ హీరో సినిమాలకు గుడ్ బై
ఈ నేపథ్యంలో ఆ వార్తలకు తెరదించుతూ దర్శకుడు హెచ్. వినోద్ స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. మలేషియాలో జరిగిన జన నాయగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హెచ్ వినోద్ మాట్లాడుతూ ‘చాలామంది జన నాయకన్ రీమేక్ లేదా పార్షియల్ రీమేక్ అంటున్నారు. ఈ విషయంపై సందేహం ఉన్న వారందరికీ నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఒక్కటే ఇది 100 శాతం తలపతి విజయ్ సినిమా. థియేటర్లలో అభిమానులకు ఇది ఒక భారీ కమర్షియల్ ట్రీట్‌గా నిలుస్తుంది,” అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో జననాయకన్ ఉన్న రీమేక్ రూమర్లకు దర్శకుడు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టినట్టయ్యింది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతుండగా తాజాగా వచ్చిన ఈ క్లారిటీతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. పూర్తిగా కొత్త కథ, తలపతి విజయ్ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో జన నాయకన్ ప్రేక్షకులను అలరించనుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
