SRH vs CSK Tickets 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో భాగంగా ఏప్రిల్ 5న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఇటు హోమ్ టీమ్ కావడం, అటు ఎంఎస్ ధోనీ ఉండడంతో ఈ మ్యాచ్ చూసేందుకు ఫాన్స్ ఆసక్తి కనబర్చుతున్నారు. అయితే ఎస్‌ఆర్‌హెచ్, సీఎస్‌కే మ్యాచ్‌కు ఉన్న డిమాండ్‌ను కొందరు కేటుగాళ్లు క్యాష్ చేసుకునేందుకు చూస్తున్నారు.
Also Read: New Tax Regime Calculator: కొత్త ఆదాయపు పన్ను విధానం.. తప్పుడు సమాచారంపై కేంద్రం క్లారిటీ!
సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌కు సంబంధించి నకిలీ టిక్కెట్‌లను కొందరు కేటుగాళ్లు సోషల్ మీడియాలో అమ్మవుతున్నారు. ఈ నకిలీ టిక్కెట్‌ల అమ్మకంపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్ మోహన్ రావు స్పందించారు. సోషల్ మీడియాలో నకిలీ టిక్కెట్‌లను విక్రయిస్తున్నట్టు వస్తున్న వదంతుల పట్ల క్రికెట్ అభిమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫ్యాన్స్ అసత్య ప్రచారాలను చూసి మోసపోవద్దని హెచ్చారించారు. ఎవరైనా సోషల్ మీడియాలో లేదా అనధికారికంగా టిక్కెట్లు విక్రయిస్తున్నట్టు మీ దృష్టికి వస్తే.. వెంటనే హెచ్‌సీఏ లేదా పోలీసులకు ఫిర్యాదు చేయమని జగన్ మోహన్ సూచించారు.