Site icon NTV Telugu

TSPSC Group-2: సంచలనం.. పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూప్–2 పరీక్షను రద్దు చేసిన హైకోర్టు..

Tg High Court Jobs

Tg High Court Jobs

TSPSC Group-2: పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూప్–2 పరీక్షలపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2015–16 సంవత్సరాల్లో నిర్వహించిన గ్రూప్–2 పరీక్షలను పూర్తిగా రద్దు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పరీక్షలపై అప్పటికే వచ్చిన పలు పిటిషన్లను విచారించిన న్యాయస్థానం.. టీజీపీఎస్సీ హైకోర్టు గత ఆదేశాలను స్పష్టంగా ఉల్లంఘించిందని వ్యాఖ్యానించింది. తీర్పులో టీజీపీఎస్సీ తన పరిధి దాటి వ్యవహరించిందని, ఫలితాల ప్రక్రియలో విధివిధానాలు సరిగా పాటించలేదని న్యాయమూర్తి తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం చేశారు. ఇప్పటికే కోర్టు సూచించిన ప్రమాణాలను పాటించకుండా కమిషన్ నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గ్రూప్–2 పరీక్షలకు సంబంధించిన మొత్తం ఫలితాలను పునర్‌మూల్యాంకనం చేయాలని, అర్హుల కొత్త జాబితాను రూపొందించి విడుదల చేయాలని హైకోర్టు టీజీపీఎస్సీకి ఆదేశించింది. ఈ ప్రక్రియను ఎనిమిది వారాలలోపు పూర్తి చేయాలని కోర్టు స్పష్టమైన గడువు విధించింది. ఈ తీర్పుతో గ్రూప్–2 పరీక్ష రాసిన అభ్యర్థుల్లో మళ్లీ కొత్త ఆశలు చిగురించాయి.

READ MORE: Delhi Car Blast: ఉగ్రవాదులకు చెందిన మరో కారు గుర్తింపు.. ఎంత అద్దె చెల్లించారంటే..!

Exit mobile version