NTV Telugu Site icon

IND vs AUS BGT: రెండో టెస్టుకు ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ ఔట్.. భారత్‌కు అడ్వాంటేజ్ కానుందా

Hazlewood

Hazlewood

IND vs AUS BGT: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పెర్త్ టెస్టులో టీమిండియా విజయం సాధించి 1-0 తో సిరీస్ లో ముందంజలో ఉంది. ఇక రెండో టెస్టు మ్యాచ్ కోసం ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలెట్టాయి. అయితే, రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు కంగారూ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అడిలైడ్‌ ఓవల్‌ వేదికగా జరగనున్న టెస్టు సిరీస్‌ రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌ దూరం కానున్నాడు. జోష్ హేజిల్‌వుడ్ గాయానికి సంబంధించిన సమాచారాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా సోషల్ మీడియాలో షేర్ చేసింది. భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో హేజిల్‌వుడ్ స్థానంలో ఏ ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారనే సమాచారాన్ని కూడా అందులో పంచుకుంది.

Also Read: IND vs PAK U-19: నేడే దాయాదుల పోరు.. భారత్‌ను ఓడించే దమ్ము పాకిస్థానుకు ఉందా

అడిలైడ్‌ ఓవల్‌ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్‌ డే-నైట్‌ మ్యాచ్‌గా జరగనుంది. దాంతో ఈ టెస్టు మ్యాచ్ పింక్ బాల్ టెస్టు కానుంది. జోష్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా ఈ డే-నైట్ టెస్టుకు దూరం కానున్న నేపథ్యంలో వీరి స్థానంలో అన్ క్యాప్డ్ పేస్ జోడీని జట్టులోకి తీసుకునేందుకు టీమ్ సెలక్టర్లు, మేనేజ్మెంట్ ప్రణాళిక సిద్ధం చేసింది. జోష్ హేజిల్‌వుడ్ అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో సైడ్ స్ట్రెయిన్ కారణంగా తొలగించబడ్డాడు. దాంతో ఆయన స్థానంలో సీన్ అబాట్, బ్రెండన్ డాగెట్‌ లలో ఒకరిని తీసుకబోతున్నట్లు ఆసీస్ మేనేజ్మెంట్ తెలిపింది. భారత్‌తో జరిగిన పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జోష్ హేజిల్‌వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతను మొదటి ఇన్నింగ్స్‌లో 29 పరుగులకే 4 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో కూడా 21 ఓవర్లు బౌలింగ్ చేసిన కేవలం 28 పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. దీన్ని బట్టి చూస్తే మొదటి టెస్టులో జోష్‌ హేజిల్‌వుడ్‌ బౌలింగ్ లో టీమిండియా బ్యాటర్లు కాస్త తడబడ్డారనే చెప్పవచ్చు. కాబట్టి, అడిలైడ్ టెస్ట్‌కు హాజిల్‌వుడ్ దూరం కావడం ఆస్ట్రేలియాకు పెద్ద దెబ్బ.

Also Read: PM Modi: నేడు డీజీపీల సదస్సులో ప్రసంగించనున్న ప్రధాని మోడీ

Show comments