Urus Car: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ లంబోర్గినీకి చెందిన ఓ లగ్జరీ కారు ఉరుస్ ని దక్కించుకున్నాడు. రూ.4.18 కోట్లకు సచిన్ కొనుగోలు చేశారు. ఈ కారును ఇటీవలే లాంఛ్ చేశారు. అయితే సచిన్ బిఎమ్‌డబ్ల్యూ కార్ల బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటంతోనే ఫస్ట్ లాంబోర్గినీ కారును దక్కించుకున్నాడు. ఆయనకు ఇప్పటికే BMW 7 సిరీస్ LI, BMW X5M, BMW i8, BMW 5 సిరీస్ కార్లు ఉన్నాయి.
Read Also: Odisha Train Accident: 3 రైళ్లు ఒకదానికొకటి ఎలా ఢీకొన్నాయో తెలుసా..?
అయితే లంబోర్ఘిని ఉరస్ ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.. 4.0 లీటర్ ట్విన్టర్బో V8 ఇంజన్ పొందుతుంది. ఈ ఇంజన్ 6,000 rpm వద్ద 641 bhp పవర్, 2,2504,500 rpm వద్ద 850 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్‌మిషన్ లభిస్తుంది. ఉరస్ కారు 3.6 సెకన్లలో 0 నుండి 100 kmph వరకు స్పీడ్ అందుకోగలదు. టాప్ స్పీడ్ గంటకు 305 కి.మీ. అలాగే గంటకు 100 కి.మీ వేగంతో వెళ్లే సమయంలో బ్రేకు వేస్తే 33.7 మీటర్ల దూరంలోనే వాహనం ఆగిపోతుంది. ఈ సూపర్ SUV భద్రత విషయంలో కూడా చాలా ముందుంది.
Read Also: Smoking: స్మోకింగ్ హానికరమైనదే.. కానీ దాని వల్ల ఇంకో సమస్య కూడా ఉంది..
అలాగే ఉరుస్‌లో ఆరు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఇది ఆఫ్-రోడింగ్‌ను లక్ష్యంగా చేసుకుని సబియా (సాండ్), టెర్రా (గ్రావెల్), నివి (మంచు) మూడు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఈ SUV పొడవు 5,112 mm, వెడల్పు 2,016 mm, ఎత్తు 1,683 mm. వీల్‌బేస్ పొడవు 3,003 mm. ఉరుస్ డిజైన్ అండ్ సాంకేతికతలో ఉన్నత ప్రమాణాలతో కూడింది. ఈ కారుని 2017 డిసెంబర్ లో ప్రపంచవ్యాప్తంగా, జనవరి 2018లో భారతదేశంలో ప్రవేశపెట్టారు, ఉరుస్ ప్రస్తుతం లంబోర్ఘిని లైనప్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా ఉంది.
