NTV Telugu Site icon

Mistakes in Salaar: సలార్ మూవీలో ఈ మిస్టేక్స్ గమనించారా?

Mistakes In Salaar

Mistakes In Salaar

Have you Noticed these Mistakes in Salaar: ప్రశాంత్ నేను డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ సినిమా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ దక్కించుకున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మంచి కలెక్షన్స్ రాబడుతూ దూసుకు పోతుంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమాన్ ఒక కీలక పాత్రలో నటించాడు. జగపతిబాబు, శ్రియ రెడ్డి, ఝాన్సీ, రామచంద్రరాజు, టిను ఆనంద్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాలో మూడు తెగల మధ్య ఉన్న సంబంధాన్ని ఆవిష్కరించారు. ఒకసారి సినిమా చూసిన వారెవరు వాటిని గుర్తు పెట్టుకోవడం అంత సులభం కాదు. కాబట్టి సలార్ సినిమాకి రిపీట్ ఆడియన్స్ కూడా పెరుగుతున్నారు. ఆ సంగతి అలా ఉంచితే సలార్ సినిమాల్లో కొన్ని పొరపాట్లు దొర్లాయ. అవేమిటి అనే పరిశీలనలోకి వెళితే

బ్యాంక్ మేనేజర్
నిజానికి శృతిహాసన్ ను ఈశ్వరి రావుకి పరిచయం చేసే క్రమంలో అస్సాం బర్మా బోర్డర్ లోని టిన్ సుఖియా ఊరి సర్పంచ్ పృధ్వి రాజు ఆమెది విజయవాడ అని పేరు దియా మన బ్యాంకు మేనేజర్ అజయ్ చుట్టమని చెప్పుకొచ్చాడు. దీంతో కొన్ని మాటల తర్వాత ఆమెను ఈశ్వరి రావు లోపలికి రానిస్తుంది. అయితే తర్వాత సీన్స్ లో వచ్చేప్పుడు మాత్రం ప్రభాస్ టిన్ సుఖియా అనే ఊరిలో తలదాచుకోవడానికి కారణం అక్కడ బ్యాంక్ బ్రాంచ్ లు, కానీ కనీసం పోస్ట్ ఆఫీస్ కూడా లేదని చెబుతారు. అయితే బ్యాంకు బ్రాంచ్ లేకుండానే మేనేజర్ ఎలా వచ్చాడు అంటూ పలువురు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

2010లో 2022 ఐఫోన్
ఇక మరొక పొరపాటు బాబీ సింహా చేతిలో కనిపించిన ఐఫోన్. ఈ సినిమాలో శౌర్యంగ తెగకు చెందిన బాబీ సింహ పేరు మార్చుకుని భారవ అనే మన్నార్ తెగకు చెందిన వ్యక్తిగా రాజమన్నార్ కుటుంబం మొత్తాన్ని నమ్మించి వారి కుటుంబానికి చెందిన రాధారమును ప్రేమించి వివాహం చేసుకుంటాడు. సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన తర్వాత ప్రభాస్ విష్ణుని చంపాడు అనే విషయం తెలిసి షఫీ ఆ విషయాన్ని బాబీ సింహకు చేరవేసినప్పుడు బాబీ సింహ చేతిలో 2022వ సంవత్సరానికి సంబంధించిన ఐఫోన్ కనిపిస్తుంది. అయితే ఈ కథ మొత్తం 2010లో జరుగుతూ ఉండటం గమనార్హం.

శౌర్యంగా తెగ చారలు
ఇక బాబీ సింహ శౌర్యాంగ తెగకు చెందిన వ్యక్తి అయినా సరే మన్నార్ తెగకు చెందిన వ్యక్తిగా అందరినీ నమ్మించి ఏకంగా కర్త కుమార్తె రాధారమను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అయితే సినిమాలో ప్రశాంత్ నీల్ చూపించిన దాని ప్రకారం శౌర్యాంగ తెగకు చెందిన వారందరి వీపుల మీద ఒక రకమైన చారలు ఉంటాయి. ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత రాధారమ ఒక్కసారి కూడా తన భర్త బాబి సింహ వీపు చూడలేదా? చూసినా అవి శౌర్యంగా తెగకు చెందిన గుర్తులు అనే ఆమె గుర్తుపట్టలేదా అనే విషయం కూడా ఒక పొరపాటు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు

సెక్యూరిటీ ప్రోటోకాల్
అలాగే ఖాన్సర్ సిటీ మొత్తానికి హై అడ్వాన్స్డ్ ఆర్మీ నియమించుకుని పకడ్బందీగా ప్లాన్ చేసుకోవడానికి కారణం ఒకటి చెబుతాడు జగపతిబాబు. శౌర్యాంగ తెగకు చెందిన ఒక్కరు బ్రతికి ఉన్నా వారి ప్రతీకారం ఊహించుకోలేమని జగపతిబాబు క్యారెక్టర్ చెబుతుంది. అయితే శౌర్యంగా నుంచి రక్షణ కోసమే అంత పెద్ద పెద్ద కోట కోడలు, నిర్మించుకున్నా సరే కోట గేట్ల నుంచి లోపలికి వచ్చే వాళ్లకు సంబంధించిన సెక్యూరిటీ ప్రోటోకాల్ అంత బలంగా లేదని ప్రభాస్ ఎంట్రీ సమయంలో తేటతెల్లమైంది. నిజంగా శౌర్యాంగుల గురించి అంత భయంగా ఉంటే వారిని ఈజీగా గుర్తించే విధంగా వారి వీపు మీద ఉన్న చారలను చెక్ చేసిన తర్వాతే కోట లోపలికి వదలమని సెక్యూరిటీ టీంకి ఒక ప్రోటోకాల్ సెట్ చేసి ఉండవచ్చు. అలా సెట్ చేసి ఉంటే ప్రభాస్ కాదు కదా భారవ అతని అసిస్టెంట్ షఫీ వంటి వారు కూడా లోపలికి వెళ్లగలిగే వారు కాదు. ఈ పొరపాట్ల విషయంలో మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి