NTV Telugu Site icon

Hundred Meter Race: పక్కెళ్లి ఆడుకోమ్మా.. ఏంటమ్మ ఆ పరుగు.. పరువు తీశావుగా..!

Abukar

Abukar

పరుగు పందెంలో ఛాంపియన్లు అంటే గుర్తొచ్చేది ఉసెన్ బోల్డ్, పీటీ ఉష. ముఖ్యంగా ఉసెన్ బోల్ట్ పరుగుల చిరుతగా పేరు పొందాడు. అంతేకాకుండా వంద మీటర్ల రేసులో ప్రపంచ రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన పేరిటే ఆ రికార్డు పదిలంగా ఉంది. అయితే 100 మీటర్ల రేసులో ఓ అథ్లెటిక్ చేసిన వింత ప్రవర్తన వల్ల పరువు తీసింది.

Krishna Gadu Ante Oka Range: ప్యాషన్ ఇన్వెస్ట్ చేస్తే పదింతల డబ్బు, పేరు.. రైటర్ ప్రసన్న కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఏం జరిగిందనే విషయంలోకి వెళితే.. చైనాలోని చెంగ్డూ వేదికగా 31వ సమ్మర్‌ వరల్డ్‌ యూనివర్సిటీ గేమ్స్‌ నిర్వహించారు. అందులో భాగంగా 100 మీటర్ల రేసు నిర్వహించారు. ఈ రేసులో సోమాలియాకు చెందిన అథ్లెటిక్ అబుకర్‌ అలీ పాల్గొంది. అయితే ఆమెను చూస్తే అథ్లెట్ నేనా అనే సందేహం కలిగింది. తన పక్కన ఉన్న సహచర అథ్లెట్లు మంచి ఫిట్‌గా కనిపిస్తుంటే.. ఆమె మాత్రం సాదాసీదాగా ఎలాంటి లక్ష్యం లేకుండా నిలబడింది.

Benefits of Red Capsicum: రెడ్ క్యాప్సికం ను ఇలా తీసుకుంటే ఆ సమస్యలకు చెక్..

అయితే అందరు అథ్లెటిక్స్ స్టాన్స్‌కు పొజిషన్‌ ఇవ్వగా.. అబుకర్‌ అలీ మాత్రం కనీసం స్టాన్స్‌ పొజిషన్‌ తీసుకోవడానికి కూడా బద్దకించింది. బజర్‌ రింగ్‌ మోగగానే తోటి అథ్లెట్లు రేసును తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నించగా.. అబుకర్‌ అలీ మాత్రం మెళ్లిగా పరిగెత్తింది. ఒకానొక సమయంలో రేసు మధ్యలోనే ఆగిపోతుందా అనే సందేహం కలిగింది. కారణమేంటంటే.. సరైన ప్రాక్టీస్‌ లేకుండానే బరిలోకి దిగడం. మరోవైపు అబుకల్ అలీ వంద మీటర్ల రేసును పూర్తి చేయడానికి 21 సెకన్లు పట్టింది. అంతేకాకుండా.. చిన్నపిల్లలా రేసు పూర్తి అయిన తర్వాత ట్రాక్‌పై జంప్‌ చేస్తూ వెళ్లడం అందరిని ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Minister Malla Reddy: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయడం ఎన్నికల స్టంటే

అయితే ఆ వీడియో చూసిన అభిమానులు దానిని ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. సోమాలియా మినిస్ట్రీ ఆఫ్‌ యూత్‌ అండ్‌ స్పోర్ట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ”ఒక అంతర్జాతీయ ఈవెంట్‌కు కనీస అవగాహన లేని వ్యక్తిని పంపించడంపై మండిపడుతున్నారు. అంతేకాకుండా సరైన ప్రాక్టీస్‌ లేకుండానే ఆమెను దేశం తరపున బరిలోకి దించడం అవమానం కిందే లెక్క.. మీ దేశం పరువును మీరే తీసుకుంటున్నారు..”అంటూ కామెంట్స్ చేస్తున్నారు.