NTV Telugu Site icon

Google Security: మీ గూగుల్ అకౌంట్‌ హ్యాక్ అయిందా..? ఇలా చెక్ చేసుకోండి..!

Google

Google

మనకు ఏ చిన్న సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్‌ లో సెర్చ్ చేస్తాం.. ఇంకా జీమెయిల్ అకౌంట్‌తో మరిన్ని సేవలను పొందుతున్నాం.. అలాగే అనేక ఫీచర్లను సైతం గూగుల్ అందిస్తుంది. అయితే ఈ క్రమంలో సైబర్ దాడులు కూడా పెరిగిపోయాయి. ముఖ్యంగా మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్, ఆర్థిక, వ్యాపార, వ్యక్తిగత విషయాలతో పాటు రహస్య సమాచారం అంతా వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఒక్కసారి మీ అకౌంట్ వివరాలు సైబర్ నేరగాళ్లకు చిక్కితే.. వాళ్లు మీ పాస్‌వర్డ్, ఫోన్ నెంబర్ వంటి కీలకమైన వివరాలను ఈజీగా కనిపెడతారు. అలాంటి ఇబ్బందులు రాకుండా గూగుల్ అనేక సెక్యూరిటీ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిని ఉపయోగించి మన గూగుల్ అకౌంట్‌ను సేఫ్‌గా ఉంచుకోవచ్చు.

Read Also: Viral Video: చంద్రయాన్-3పై పాకిస్థాన్ మాజీ మంత్రి ఫన్నీ కామెంట్స్.. వీడియో వైరల్

అంతేకాదు మీ గూగుల్ అకౌంట్‌ను ఇంకా వేరే ఎవరైనా వాడుతున్నారో లేదో తెలుసుకునే ఛాన్స్ కూడా ఉంది. గూగుల్ ఇటీవల తీసుకొచ్చిన ఫీచర్ల ద్వారా మీ గూగుల్ అకౌంట్‌ ఎన్ని కంప్యూటర్లు, ఎన్ని ఫోన్లతో పాటు ఇతర డివైజ్‌లలో సైన్ ఇన్ అయ్యిందో తెలుసుకునే అవకాశం ఉంది. అయితే, మీ గూగుల్ అకౌంట్‌కు ఇతరులు ఎవరు సైన్ ఇన్ చేయలేదని నిర్ధారించుకోవడానికి.. గూగుల్.కమ్/డివైస్కి వెళ్లండి.. అక్కడ మీ గూగుల్ అకౌంట్‌కు అదనపు భద్రత ఎలా జత చేయాలో తెలియజేస్తుంది.

Read Also: Guppedantha Manasu: రిషి తల్లి ఎంత హాట్ గా ఉందో చూశారా.. ?

ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్లో సెట్టింగ్స్ ఆప్షన్స్‌లోకి వెళ్లి.. కిందకి స్క్రోల్ చేస్తే గూగుల్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.. ఆ తర్వాత కొత్తగా మ్యానేజ్ యూవర్ గూగుల్ అకౌంట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే.. టాప్‌లో సెక్యూరిటీ ఆప్షన్ కనిపించేంత వరకు కుడివైపుకు స్లైడ్ చేయాలి.. యూవర్ డివైజ్ ఆప్షన్ కనిపించేంత వరకు కిందకి స్క్రోల్ చేయాలి.. మ్యానేజ్ ఆల్ డివైజ్స్ ఆప్షన్‌పై క్లిక్ చేసి, మీ గూగుల్ అకౌంట్ ఏయే డివైజ్‌లో లాగిన్ అయ్యిందో తెలుసుకోవచ్చు. మీరు ఏ డివైజ్‌లో అయితే గూగుల్ లాగిన్ అయ్యారు.. ఎందులో అవ్వలేదో చూసుకోవచ్చు. మీరు వాడని డివైజ్ ఏదైనా కనిపిస్తుంటే, వెంటనే దానిపై క్లిక్ చేసి సైన్ ఔట్ బటన్ పై క్లిక్ చేస్తే.. గూగుల్ డ్రైవ్ టీప్స్ లో గూగుల్ స్టోరేజీ ఫుల్ అయ్యిందా.. అయితే ఈ టిప్స్‌తో ఫ్రీగా స్టోరేజీ స్పేస్ ను పెంచుకోవచ్చు.

Read Also: Mobile Charger: మీ మొబైల్ ఫోన్ కి వేరే ఛార్జర్ తో ఛార్జ్ చేస్తున్నారా..?

అయితే, మీకు తెలియని డివైజ్‌లలో మీ గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అయితే.. సెట్టింగ్స్ ఆప్షన్స్‌లోకి వెళ్లి సైన్ అవుట్ చేసిన తర్వాత మీ అకౌంట్ పాస్‌వర్డ్‌ను ఛేంజ్ చేసుకోవాలి.. అనంతరం అదనపు భద్రత కోసం టూ స్టెప్ వెరిఫికేషన్‌ను స్టార్ట్ చేయాలి. ఇదంతా సెక్యూరిటీ ఆప్షన్స్‌లోనే ఉంటుంది. టు స్టెప్ వెరిఫికేషన్ సెటప్ చేసిన తర్వాత, మీరు ఎంటర్ చేసిన పాస్‌వర్డ్, టు స్టెప్ వెరిఫికేషన్ ప్రారంభించిన తర్వాత ఏదైనా డివైజ్‌లో మీ గూగుల్ అకౌంట్‌కు లాగిన్ చేసుకోవాలి.