NTV Telugu Site icon

Vinesh Phogat: హర్యానా అసెంబ్లీ ఎన్నికలు.. వినేష్ ఫొగట్ ఘన విజయం!

Vinesh Phogat Wins

Vinesh Phogat Wins

Haryana Election Results 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారత మాజీ రెజ్లర్, కాంగ్రెస్ నేత వినేష్ ఫొగట్ ఘన విజయం సాధించారు. జులానా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఆమె 5 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. బీజేపీకి చెందిన మాజీ ఆర్మీ కెప్టెన్ యోగేష్ బైరాగి రెండో స్థానంలో, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అభ్యర్థి సురేందర్ లాథర్ మూడో స్థానంలో నిలిచారు. ఈ విజయంతో వినేష్ ఫొగట్ సంబరాల్లో మునిగిపోయారు. కాంగ్రెస్ శ్రేణులు ఆమెకు దండాలు వేసి.. బాణాసంచా కాల్చుతున్నారు.

హర్యానాలో అక్టోబర్ 5వ తేదీన ఒకే విడతలో 90 నియోజకవర్గాలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈరోజు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ మొదలైంది. అందరూ ఊహించినట్లే.. మొదటి రెండు రౌండ్లలో వినేష్ ఫొగట్ ఆధిక్యంలో దూసుకెళ్లారు. 3, 4, 5 రౌండ్లలో యోగేష్ బైరాగి లీడ్‌లోకి దూసుకొచ్చారు. ఏకంగా 5 వేల లీడింగ్‌లోకి వెళ్లారు. దాంతో వినేష్ కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకి వెళ్లిపోయారు. అయితే ఆరో రౌండ్ పూర్తయ్యేసరికి వినేష్ అనూహ్యంగా 1000 లీడింగ్‌లోకి వెళ్లారు. 7వ రౌండ్ పూర్తయ్యేసరికి 38 ఓట్ల లీడ్ మాత్రమే దక్కింది. దాంతో అందరిలో టెన్షన్ మొదలైంది.

Also Read: IRE vs RSA: క్రికెట్‌లో మరో సంచలనం.. దక్షిణాఫ్రికాను ఓడించిన ఐర్లాండ్!

ఎనిమిదవ రౌండ్ పూర్తయ్యేసరికి వినేష్ ఫొగట్ 2 వేల లీడింగ్‌లోకి దూసుకెళ్లారు. 9వ రౌండ్‌కు ఆధిక్యం డబుల్ అయింది. 11వ రౌండ్ కల్లా 6 వేలు దాటింది. 14 రౌండ్ ముగిసేసరికి 5 వేలకు పైగా లీడింగ్‌ సాధించారు. వినేష్ చివరకు మంచి మెజారిటీతో జులానా అసెంబ్లీ స్థానంను కైవసం చేసుకున్నారు.

Show comments