NTV Telugu Site icon

Viva Harsha Divorce: విడాకులు తీసుకున్న క‌మెడియ‌న్ హ‌ర్ష.. అసలు నిజం ఇదే..

Viva Harsha

Viva Harsha

Viva Harsha Divorce: ప్రస్తుతం సోషల్ మీడియాలో వైవా హర్షకు సంబంధించిన విషయం తెగ చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా వైవహర్ష తన వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదురయ్యాయని.. విడాకులు తీసుకున్నాడని అనేక రూమర్స్ వచ్చాయి. ఇందుకు సంబంధించి రెండు రోజుల క్రితం వైవా హర్ష ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశాడు. ఈ పోస్టులో జీవితం అనేది ఓ రోలర్ కోస్టర్ లా ఉంటుందని.. ఆప్స్ అండ్ డౌన్స్, లోస్ అండ్ హైస్, ఎక్సైట్మెంట్, యాంగ్సైటి, థ్రిల్లింగ్, భయం ఇలా అనేక విషయాలు ఉంటాయని వాటిలో ఏది మన కంట్రోల్లో ఉండదు కాబట్టి మనల్ని ఆపేందుకు మధ్యలో ఎన్నో వస్తాయంటూ.. అవి కూడా టైం వస్తే తమంతట అవే వెళ్లిపోతాయని., అలాంటి జీవితం రైడను ఎంజాయ్ చేస్తూ ఉండాలని.. అసలు ఎలాంటిది కూడా ఆశించకూడదు.. ఆ తర్వాత నిరాశ.. అసలే పడకూడదు మొత్తంగా జీవితం ఎటువైపు వెళ్తే అటు వెళ్లడమే.. అంటూ ఓ పోస్ట్ చేశాడు.

Raj Tarun Lavanya Case: హైడ్రామాలో కొత్త ట్విస్ట్… లావణ్యపై రాజ్ తరుణ్ తల్లితండ్రులు కంప్లైంట్..

గత కొన్ని రోజుల నుంచి అసలు వైవా హర్షకు ఏమైందని.? భార్యతో వచ్చిన గొడవల కారణంగా అతడు విడాకులు తీసుకుంటున్నాడు..? అన్న విషయాలపై తాజాగా ఆయన ఓ క్లారిటీ ఇచ్చాడు.. ఈ విషయం సంబంధించి మరో పోస్టులో తన పర్సనల్ లైఫ్ సాఫీగానే సాగుతోందని.. తాను చాలా హ్యాపీగా ఉన్నానని తెలిపారు. అంతేకాకుండా పనిలో ఉన్నప్పుడు కొన్ని తెలివి తక్కువ, మెదడులేని రాజకీయాల కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. అంతే కానీ. ఇంకా మరో విషయం లేదంటూ అతను సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఇలాంటి రూమర్స్ చాలానే వస్తుంటాయని.. ప్రస్తుతం తాను సంతోషంగానే ఉన్నానని, ఇంకా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తాను మరింత స్ట్రాంగ్ గా మళ్ళీ తిరిగి వస్తానంటూ తెలుపుతూనే మనకు ఎదురు దెబ్బలు తగిలిన వాటిని తట్టుకొని మళ్లీ పోరాడడం గొప్పదని హర్ష చెప్పుకొచ్చాడు. దీంతో తన విడాకుల విషయంపై చెక్ పడినట్లు అయింది.

Show comments