Site icon NTV Telugu

Harsh Goenka: ఇది జైలు కాదండోయ్‌.. కొవిడ్ ఐసోలేషన్‌ వార్డు.. హర్ష గోయెంకా ట్వీట్

Covid Isolation Ward

Covid Isolation Ward

Harsh Goenka shared covid isolation ward video of China: కొవిడ్‌ను కట్టడి చేసేందుకు చైనా జీరో కొవిడ్‌ పాలసీని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో ఒక్క కేసు నమోదైనా చైనా సర్కారు లక్షల మందిని ఐసోలేషన్‌కు పరిమితం చేస్తోంది. మరి కొవిడ్‌ లక్షణాలు కనిపించిన వారి పరిస్థితి దారుణంగా ఉన్నట్లు పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా ట్విట్టర్‌ వేదికగా పోస్ట్‌ చేసిన వీడియో చూస్తే తెలుస్తోంది. చైనాలోని కొవిడ్‌ ఐసోలేషన్‌ వార్డులో జైలులోని పరిస్థితులను తలపిస్తున్నట్లు హర్ష గోయెంకా వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Delhi Liquor Scam: మనీష్ సిసోడియాకు సీబీఐ నోటీసులు.. “సత్యమేవ జయతే” అంటూ సిసోడియా ట్వీట్

ఇది జైలు కాదు, చైనాలోని కొవిడ్‌ ఐసోలేషన్‌ వార్డు.. అని చైనాలోని పరిస్థితుల గురించి హర్ష గోయెంకా రాసుకొచ్చారు. ముందుగా ఈ వీడియోను “వాల్ స్ట్రీట్ సిల్వర్” అనే హ్యాండిల్ పోస్ట్ చేసింది. ఇది “చైనా కోవిడ్ ఐసోలేషన్ క్యాంపుల లోపల జీవితం. పిల్లలతో ఉన్న స్త్రీలు, గర్భిణీ స్త్రీలు కూడా ఇక్కడ లాక్ చేయబడినట్లు నివేదికలు ఉన్నాయి. ఇది నిజంగా కొవిడ్ గురించేనా? నియంత్రణ గురించేనా?” అని వాల్ స్ట్రీట్ సిల్వర్ పోస్ట్ చేసింది. జైలు కన్నా దారుణంగా నిర్బంధించడంపై నెటిజన్లు ఆశ్చర్యంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. కొంత మంది వామ్మో.. అంటూ కామెంట్ చేశారు. మరికొందరేమో చైనాలో కొవిడ్‌ కంటే ప్రమాదకరమైన రోగం ఉందేమో అని అనుమానం వ్యక్తం చేశారు.

Exit mobile version