NTV Telugu Site icon

Haromhara Contest : మిస్డ్ కాల్ ఇవ్వండి..బిగ్ గిఫ్ట్ గెలుచుకోండి..

Haromhara (1)

Haromhara (1)

Haromhara Contest : టాలీవుడ్ హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎస్ఎంఎస్ సినిమాతో హీరోగా పరిచయం అయిన సుధీర్ బాబు ఆ తరువాత “ప్రేమకథా చిత్రం”సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.కానీ ఆ తరువాత సుధీర్ బాబు చేసిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.అయిన కూడా సుధీర్ బాబు ప్రతిసారి సరికొత్త కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.తాజాగా సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ “హరోంహర”.జ్ఞాన సాగర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.1989 బ్యాక్ డ్రాప్ పీరియాడిక్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతుంది.సుమంత్ జి .నాయుడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Read Also :Bharatheeyudu 2 : భారతీయుడు 2 నుంచి “చెంగలువ” సాంగ్ వచ్చేసింది..

ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ ,టీజర్ ,సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ సినిమాను మొదట మే 31 సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.అయితే ఆ రోజు వరుస సినిమాలు రిలీజ్ ఉండటంతో సుధీర్ బాబు మూవీ జూన్ 14 కు వాయిదా పడింది.దీనితో ఈ సినిమాకు చిత్ర యూనిట్ ఎంతో డిఫరెంట్ గా ప్రమోషన్స్ నిర్వహిస్తుంది.ఈ సినిమాలో సుధీర్ బాబు సుబ్రహ్మణ్యం అనేపాత్రలో నటిస్తున్నారు.తాజాగా మేకర్స్ హరోంహర మూవీ కాంటెస్ట్ ఏర్పాటు చేసారు .ఈ కాంటెస్ట్ లో 08045936069 టోల్ ఫ్రీ నెంబర్ కు మిస్డ్ కాల్ కాల్ ఇచ్చి కాంటెస్ట్ లో ఎన్ రోల్ అవ్వండి. సుబ్రహ్మణ్యం జీప్ ,ఐ ఫోన్ 15 pro ,చేతక్ బైక్ ను సొంతం చేసుకోండి అని మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఈ కాంటెస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.