NTV Telugu Site icon

WPL20223 : హర్మన్ ప్రీత్ స్టన్నింగ్ క్యాచ్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Harmanpreet

Harmanpreet

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా యూపీ వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ స్టన్నింగ్ క్యాచ్ తో మెరిసింది. క్యాచ్ తీసుకుంటుందని ఎవరు ఊహించని రీతిలో హర్మన్ క్యాచ్ తీసుకోవడంతో వీడియో వైరల్ గా మారింది. యూపీ బ్యాటర్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ లో హేలీ మాథ్యూస్ తొలి బంతిని ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేసింది. దేవికా డ్రైవ్ ఆడే నేపథ్యంలో బంతి బ్యాట్ ఎడ్జ్ కు తాకి వెనక్కి వెళ్లింది. అక్కడే హర్మన్ అద్భుతంగా డైవ్ చేసి ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ తీసుకుంది. కాస్త పట్టు తప్పినా బంతి చేజారిపోయేది. అందుకే క్యాచ్ అందుకోగానే హర్మన్ కూడా చాలా సేపు బంతిని తన చేతితో పట్టుకొని గ్రౌండ్ లో తిరిగింది.

Also Read : Bhumireddy Ramgopal Reddy: పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీగా భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి విక్టరీ

ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఉత్కంఠ పోరులో యూపీ వారియర్స్ విజయాన్ని అందుకుంది. ముంబై ఇండియన్స్ జట్టు జోరుకు అడ్డుకట్ట వేసింది. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్స్ 19.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. చివరి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ లో మూడు బంతుల్లో ఆరు పరుగులు కావాల్సిన దశలో ఎసెల్ స్టోన్ సిక్సర్ కొట్టి జట్టును గెలిపించింది. అంతకుముందు గ్రేస్ హారిస్ 38, తాహిలా మెక్ గ్రాత్ 39 పరుగులతో కీలక ఇన్సింగ్స్ ఆడారు. ఈ విజయంతో యూపీ వారియర్స్ తమ ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకున్నారు.