Site icon NTV Telugu

Harmanpreet Kaur: ఇది ఆరంభం మాత్రమే.. ఇక అలవాటు చేసుకోవాలి.. కెప్టెన్ భావోద్వేకం..!

Harmanpreet Kaur

Harmanpreet Kaur

Harmanpreet Kaur: భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అర్ధరాత్రి చారిత్రాత్మక విజయాన్ని అందుకుని “అడ్డంకులను బద్దలు కొట్టాం… ఇది అంతం కాదు, కేవలం ఆరంభం మాత్రమే” అని పేర్కొంది. ప్రపంచ కప్ గెలిచిన అద్భుత ఘట్టంలో ఆమె గతంలో ఎన్నడూ చూడని భావోద్వేగాల ప్రదర్శనను చూపింది. క్యాచ్ పట్టిన తర్వాత రేపంటూ లేనట్టుగా పిచ్చిగా పరిగెత్తింది. ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ యువ క్రీడాకారులు సంబరాలు చేసుకుంటుండగా కాస్త దూరంగా నిలబడింది. అనంతరం తన “గురువు” అమోల్ మజుందార్ పాదాలను తాకి, భావోద్వేగంతో ఆయనను కౌగిలించుకుంది.

Road Accident: చేవెళ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొట్టి బోల్తా పడిన టిప్పర్..!

విజయం తర్వాత, హర్మన్‌ప్రీత్ భారత మహిళల క్రికెట్‌కు చెందిన దిగ్గజాలు మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామిలను కప్ అందుకోవడానికి పిలిచింది. దీనితో ఈ ఇద్దరు లెజెండ్‌లు కూడా కన్నీరు పెట్టుకున్నారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్, వైస్ కెప్టెన్ స్మృతి మంధానతో కలిసి ఝులన్‌ను ఆలింగనం చేసుకుని “దీదీ, ఇది మీ కోసమే” అని చెప్పడం చారిత్రక క్షణంగా నిలిచింది. ఇక కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. “ఇది ఆరంభం. మేము ఈ అడ్డంకిని బద్దలు కొట్టాలనుకున్నాం. మా తదుపరి లక్ష్యం దీన్ని ఒక అలవాటుగా మార్చుకోవడమే. మేము దీని కోసం ఎదురుచూస్తున్నాం.. ఆ క్షణం ఇప్పుడు వచ్చింది. ముందు ముందు ఎన్నో పెద్ద సందర్భాలు రానున్నాయి. మేము మెరుగుపరుచుకుంటూ పోవాలనుకుంటున్నాం. ఇది ముగింపు కాదు, కేవలం ఆరంభం మాత్రమే అని ఆమె పేర్కొంది.

Private Colleges Bandh: 9 వేల కోట్ల బకాయిల కోసం పోరు.. నేటి నుంచి ప్రైవేటు కళాశాలలు బంద్‌..!

Exit mobile version