Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Harish Rao Review Meeting Over Rythu Runa Mafi

Harish Rao : రుణమాఫీ డబ్బు ప్రతి రైతు చేతికి వెళ్లాలన్నది సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష

Published Date :September 4, 2023 , 8:36 pm
By Gogikar Sai Krishna
Harish Rao : రుణమాఫీ డబ్బు ప్రతి రైతు చేతికి వెళ్లాలన్నది సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష
  • Follow Us :
  • google news
  • dailyhunt

రైతు రుణమాఫీపై డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో బ్యాంకర్లతో ఆర్థిక మంత్రి హరీష్‌ రావు అధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో… దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, సీఎస్‌ శాంతి కుమారి, స్పెషల్ సీఎస్ రామకృష్ణరావు వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతులకు రెండుసార్లు రుణమాఫీ పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఏకైక ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమని అని కొనియాడారు. రుణమాఫీ డబ్బు ప్రతి రూపాయి రైతు చేతికి వెళ్లాలన్నది సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష అని. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఇప్పటికే లక్షలోపు ఋణాలు మాఫీ చేసిందన్నారు. మిగతావారికి ప్రాధాన్యతా క్రమంలో రుణమాఫీ జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా.. ‘ఇప్పటి వరకు 18 లక్షల 79 వేల మంది రైతులకు రుణమాఫీ కింద రూ.9654 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది. 17 లక్షల 15 వేల మందికి రుణమాఫీ డబ్బులు వారి ఖాతాల్లో చేరాయి. సాంకేతిక, ఇతర కారణాల వల్ల సుమారు 1.6 లక్షల మందికి ఇంకా రుణ మాఫీ కాలేదు. వీరికి వెంటనే అందజేయాలి. బ్యాంకు ఖాతాలు పనిచేయక పోవడం, అకౌంట్లను క్లోజ్‌ చేయడం, అకౌంట్‌ నంబర్లను మార్చడం, బ్యాంకుల విలీనం అనే నాలుగు కారణాల వల్ల ఈ సమస్య తలెత్తినట్టు వివరించిన అధికారులు. చర్చించిన అనంతరం మూడు పరిష్కార మార్గాలు గుర్తింపు.

1) ఆధార్‌ నంబర్ల సాయంతో రైతు బంధు ఖాతాలను గుర్తించి ఆ ఖాతాల్లో రుణ మాఫీ డబ్బు వేయడం, దీని వల్ల సుమారు మరో లక్ష మందికి రుణ మాఫీ డబ్బు అందుతుంది.
2) ఎన్‌.పీ.సీ.ఐ సాయంతో బ్యాంకులు రైతుల బ్యాంకు ఖాతాలను సేకరించి ప్రభుత్వానికి అందజేయాలి. వారికి ఆర్థిక శాఖ నిధులు విడుదల చేస్తుంది. ఇలా దాదాపు 50 వేల మందికి మూడు రోజుల్లోగా డబ్బు వేయాలని నిర్ణయం.
3) మిగతా 16వేల మంది వివరాలను కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో వివరాలను పరిశీలిస్తారు. ఆ సమాచారం ఆధారంగా రుణమాఫీ పూర్తి చేస్తారు.

రుణమాఫీ సమస్యల పరిష్కారానికి బ్యాంకులు రాష్ట్ర స్థాయిలో గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేయాలి. ఒక అధికారిని నియమించి, వారి ఫోన్‌ నంబర్‌, ఈ మెయిల్‌ ఐడీని ప్రజలకు తెలియజేయాలి. రైతులు ముందుగా బ్యాంకు స్థాయిలో సంప్రదిస్తారు. అక్కడ పరిష్కారం కాకపోతే రాష్ట్ర స్థాయి అధికారిని సంప్రదించి, సమస్యను చెప్పుకొనేలా ఏర్పాటు చేయాలి. ఇదే తరహాలో వ్యవసాయ శాఖ తరుపున జిల్లాకు ఒక నోడల్‌ ఆఫీసర్‌ను నియమిస్తాం.

రుణ మాఫీ పొందిన రైతులందరికీ బ్యాంకులు కొత్త రుణాలు మంజూరు చేయాలి. పురోగతిపై బ్యాంకుల వారీగా ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలి. రుణమాఫీ పొందిన వారిలో ఇప్పటి వరకు 35 శాతం మందికి మ్రాతమే కొత్త రుణాలు మంజూరైనట్టు గణాంకాలు చెప్తున్నాయి. ఈ నెలాఖరు నాటికి మొత్తం 18.79 లక్షల మంది రైతులకు పంట రుణాలు రెన్యువల్‌ పూర్తి కావాలి. ప్రభుత్వం మాఫీ చేసిన రూ.9654 కోట్ల మేర తిరిగి కొత్త లోన్ల రూపంలో రైతులకు చేరాలి. కొత్త రుణాలపై జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్యేలు, ఇతర ్రపజా ్రపతినిధుల సహకారంతో రైతులకు అవగాహన కల్పించాలి.

రుణమాఫీ, పంట రుణాల రెన్యువల్‌పై ఈ నెలాఖరులో మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం ఆయా జిల్లాల్లో రుణ మాఫీ అంశంపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పలు అదేశాలు జారీ చేశారు. రుణ మాఫీ సంబధిత అన్ని సమస్యలు సత్వరం పరిష్కరించి రైతులకు రుణాలు అందేలా చూడాలన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • V

తాజావార్తలు

  • Flight Ticket Price Hike: విమాన టికెట్ ధరలకు రెక్కలు.. ఇంధన సర్‌ఛార్జ్‌ వడ్డింపు..

  • AP High Court: అవినీతి అధికారులకు షాకిచ్చిన హైకోర్టు.. సీజ్‌ చేసిన నగల విడుదలకు బ్రేక్..

  • Off The Record: బ్యాంకుకు కన్నం వేసినోడితోనే టీడీపీ నేత భేరాలు

  • Reliance: ‘దేశ ఇంధన భద్రతే మా ప్రాధాన్యత’.. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్!

  • Off The Record : చిన్నన్నయ్య కోసం పవన్ పవర్‌ను గట్టిగా వాడబోతున్నారా..?

ట్రెండింగ్‌

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions