Site icon NTV Telugu

Former Minister Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు ఇంట తీవ్ర విషాదం..

Harisha

Harisha

Harish Rao father death: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ మంగళవారం తెల్లవారు జామున కన్నుమూశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని క్రిన్స్‌విల్లాస్‌లో సత్యనారాయణ పార్థివదేహాన్ని ఉంచారు. ఈ మరణ వార్త వినగానే బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు. హరీష్ రావు తండ్రి సత్యనారాయణ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. హరీష్ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

READ MORE: Off The Record: ఆ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే… పార్టీ లైన్‌లోనే ఉన్నారా? లేక సరిహద్దులు దాటేశారా?

Exit mobile version