NTV Telugu Site icon

Harihara Veeramallu : మూవీ రిలీజ్ పై ఆసక్తికర అప్డేట్ ఇచ్చిన నిర్మాత..

Whatsapp Image 2023 09 04 At 7.17.57 Pm

Whatsapp Image 2023 09 04 At 7.17.57 Pm

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న పీరియాడిక్ మూవీ `హరిహర వీరమల్లు`. ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో మొదలైనా కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. అయితే చిత్రానికి సంబంధించి ఇటీవల పవన్‌ పుట్టిన రోజు సందర్బంగా కొత్త లుక్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.దీంతో సినిమా షూటింగ్ త్వరలోనే మళ్ళీ స్టార్ట్ కాబోతున్నట్లు చిత్ర యూనిట్ హింట్ ఇచ్చింది.ఈ నేపథ్యంలో ఈ మూవీ కి సంబంధించి తాజాగా ఓ సర్ప్రైజింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు నిర్మాత ఏఎం రత్నం. సినిమా షూటింగ్‌, రిలీజ్‌కి సంబంధించిన విషయంలో ఆయన క్లారిటీ ఇచ్చారు.తాజాగా ఆయన `రూల్స్ రంజాన్` చిత్ర విడుదల తేదీ ప్రకటన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. `హరిహర వీరమల్లు` సినిమా గురించి అప్డేట్ అడుగగా ఆయన ఎట్టకేలకు నోరు విప్పారు.

ఈ సినిమా భారీ పాన్‌ ఇండియా మూవీ గా తెరకెక్కుతుంది అని ఆయన తెలిపారు.ఇది ఒక పీరియడ్‌ సినిమా అని భారీ సెట్స్, కాస్ట్యూమ్స్ తో కూడుకుని ఉంటుంది. అయితే పవన్‌ ప్రస్తుత బిజీ షెడ్యూల్‌ గురించి అందరికి తెలిసిందే. ఓ వైపు పాలిటిక్స్ అలాగే మరోవైపు సినిమాలు చేస్తున్నారు.. కాబట్టి కచ్చితంగా `హరిహర వీరమల్లు` సినిమాను పూర్తి చేసి తీరుతారు అని నిర్మాత ఏ ఎం రత్నం తెలిపారు.ఈ సందర్భంగా షూటింగ్‌ అప్డేట్ అలాగే విడుదల విషయం గురించి కూడా ఆయన వెల్లడించారు. పవన్‌ పాలిటిక్స్ బిజీ నేపథ్యంలో త్వరగా పూర్తయ్యే సినిమాలను ఆయన చేస్తున్నారు, అందుకే రీమేక్‌లు చేస్తున్నారని కూడా తెలిపారు. అదే సమయంలో తమ సినిమా షూటింగ్‌ కూడా జరుపబోతున్నామని ఆయన తెలిపారు. ఈ ఏడాది చివరి కల్లా `హరిహర వీరమల్లు` షూటింగ్‌ని పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.. వచ్చే ఏడాది ఏపీ ఎలక్షన్ల కన్నా ముందే తమ సినిమాని రిలీజ్‌ చేస్తామని ఆయన ప్రకటించారు., ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదని కూడా అన్నారు. ఈ ఒక్క మాటతో ఫ్యాన్స్ ఎంతో సంతోషించారు