Site icon NTV Telugu

Hari Hara Veeramallu : సినిమా షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అవ్వబోతుందా..?

Whatsapp Image 2023 07 09 At 8.58.59 Pm

Whatsapp Image 2023 07 09 At 8.58.59 Pm

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పీరియాడికల్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతోన్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ గా ఉండటం వలన ఈ సినిమాకు డేట్స్ ఇవ్వడం కష్టం అయింది. ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ  కంప్లీట్ అయినా కూడా మేజర్ పార్ట్ మిగిలిపోయినట్టు సమాచారం.అయితే ఈ సినిమా కోసం పవర్ స్టార్ ఎప్పుడు డేట్స్ ఇస్తాడా అని మూవీ టీం అంతా ఎంతగానో ఎదరు చూస్తున్నారు. హరిహర వీరమల్లు విడుదల విషయం  పక్కన పెడితే ఈ సినిమా షూటింగ్ అంతా ఎప్పుడు పూర్తి అవుతుందో కూడా తెలియని పరిస్థితి..పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ రాజకీయాలలో బాగా బిజీ అయిపోయారు.. ఓ నెల రోజులు షూటింగ్స్ కోసం టైమ్ కేటాయించారు పవన్ కళ్యాణ్.ఇతర సినిమాలకు టైమ్ కేటాయించిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుకు మాత్రం పెద్దగా సమయం ఇవ్వలేకపోతున్నట్లు సమాచారం.. దానికి కారణం కూడా ఉంది.

ఇతర సినిమాలకు పవన్ కళ్యాణ్ డేట్స్ తక్కువ ఇస్తే సరిపోతుంది కానీ హరిహరవీరమల్లు షూటింగ్ కు ఎక్కువగా డేట్స్ కావాలి.ఈ మూవీ పీరియాడికల్ స్టోరీ కావడంతో.. షూటింగ్ కు ఎక్కువ సమయం పడుతుంది. ఎక్కువ షార్ట్స్ కావాలి. యాక్షన్ సీక్వెన్స్ లు ఇలా చాలా కారణాలు వున్నాయి.ఈ లోగా పవన్ కళ్యాణ్ వారాహీ యాత్ర ను కూడా మొదలు పెట్టారు. దీనితో ఈ సినిమాను సరైన సమయం తీసుకోని పూర్తి చేయాలనే ప్లాన్ లో వున్నారు పవన్ కళ్యాణ్.ఈ లోగా మిగిలిన సినిమాలకు డేట్స్ కేటాయించి వాటిని పూర్తి చేసే పనిలో వున్నారు పవన్ కళ్యాణ్.  తాజా సమాచారం ప్రకారం పవర్ స్టార్ త్వరలోనే ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించబోతున్నట్టు సమాచారం.ప్రస్తుతం వారాహీ యాత్ర లో బిజీ గా వున్న పవర్ స్టార్ . త్వరలో వీలు చూసుకుని హరిహర వీరమల్లును కంప్లీట్ చేయబోతున్నట్లు సమాచారం.

Exit mobile version