Hardik Pandya Luxury Watch: ప్రతిష్టాత్మక ఆసియా కప్ 2025కి మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్‌లో టోర్నీ జరగనుండగా.. మొదటి మ్యాచ్ హాంకాంగ్, అఫ్గానిస్థాన్ టీమ్స్ మధ్య జరగనుంది. భారత్ తన మొదటి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న ఆతిథ్య యూఏఈని ఢీకొట్టనుంది. ఆసియా కప్ కోసం ఇప్పటికే యూఏఈ చేరుకున్న టీమిండియా ప్లేయర్స్.. ముమ్మరంగా సాధన చేస్తున్నారు. భారత ఆటగాళ్లు గత 4-5 రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ఆసియా కప్ ఆరంభానికి ముందే స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వార్తల్లో నిలిచాడు. హార్దిక్ అత్యంత ఖరీదైన వాచ్ ధరించడమే ఇందుకు కారణం.
హార్దిక్ పాండ్యా అత్యంత ఖరీదైన వాచ్ ధరించి దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో ప్రాక్టీస్‌కు వచ్చాడు. అతడు రిచర్డ్ మిల్లె ఆర్ఎమ్27-04 వాచ్ ధరించాడు. దీని ధర దాదాపుగా రూ.20 కోట్లు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన వాచ్‌లలో రిచర్డ్ మిల్లె ఒకటి. ప్రపంచంలో కేవలం 50 మంది వద్ద మాత్రమే ఈ వాచ్ ఉంది. స్పెయిన్ టెన్నిస్ లెజెండ్ రాఫెల్ నాదల్ కోసం ఈ వాచ్ తయారు చేయబడింది. ఈ వాచ్ బరువు కేవలం 30 గ్రాములే. ఇది 12,000 G కంటే ఎక్కువ ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. దేని ధర 2250000 యూఎస్ డాలర్లు (20 కోట్ల రూపాయలు).
Also Read: Telangana BJP: బీజేపీ రాష్ట్ర కమిటీని ప్రకటించిన అధిష్ఠానం.. ముగ్గురు ప్రధాన కార్యదర్శులు!
ఆసియా కప్ 2025 విన్నర్‌కు 3 లక్షల యూఎస్ డాలర్లు (2.6 కోట్ల రూపాయలు) ప్రైజ్ మనీగా దక్కుతుంది. హార్దిక్ పాండ్యా వాచ్ ధర రూ.20 కోట్లు. అంటే ఆసియా కప్ ప్రైజ్ మనీ కంటే హార్దిక్ వాచ్ ధర 10 రెట్లు ఎక్కువ. విషయం తెలిసిన ఫాన్స్ నోరెళ్లబెడుతున్నారు. ‘దీనమ్మ జీవితం.. వాచ్ ధర 20 కోట్లా’, ‘అయ్యా బాబోయ్.. 20 కోట్లు ఏందీ సామీ’ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. హార్దిక్ శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రాక్టీస్ ఫోటోలను షేర్ చేశాడు. ‘బ్యాక్ టు బిజినెస్’ అని క్యాప్షన్ రాశాడు. ఆ పోస్ట్‌లోని ఫోటోలలో రిచర్డ్ మిల్లె వాచ్ అతడికి చేతికి కనిపించింది.
