టీం ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఆటతీరుతో, వ్యక్తిగత జీవితం విషయంలో వార్తల్లో నిలుస్తుంటాడు. ఐపీఎల్ 2025లో బాల్, బ్యాట్‌తో సందడి చేసిన తర్వాత, హార్దిక్ ప్రస్తుతం తన కుటుంబంతో సమయం గడుపుతున్నాడు. ఈ సమయంలో, హార్దిక్ తన కుమారుడు అగస్త్యతో కలిసి ఉన్న ఒక వీడియోను నెటిజన్స్ తో పంచుకున్నాడు. హార్దిక్ స్వయంగా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
Also Read:WI vs Pak: వెస్టిండీస్‌తో సిరీస్‌కు పాక్ జట్టు ప్రకటన.. బాబర్‌కు చుక్కెదురు.. అఫ్రిది రీఎంట్రీ!
హార్దిక్ క్యాప్షన్‌లో ఇలా రాసుకొచ్చాడు.. “బ్యాట్ సెలెక్షన్ గురించి నా స్థానిక క్రికెట్ నిపుణుడు అగస్త్య నుంచి నేను సలహా తీసుకోవలసి వచ్చింది. ఈ 1 నిమిషం 9 సెకన్ల వీడియోలో, హార్దిక్ తన కొడుకు అగస్త్యతో తన బ్యాట్ గురించి మాట్లాడుతున్నట్లు చూడవచ్చు.
Also Read:Landmine Blast: జమ్మూ కాశ్మీర్‌లో పేలిన ల్యాండ్‌మైన్.. ఆర్మీ జవాను మృతి
హార్దిక్ వేర్వేరు వెయిట్ ఉన్న మూడు బ్యాట్లను తూకం వేస్తాడు. తర్వాత భారత ఆల్ రౌండర్ తన కొడుకును ఏ బ్యాట్ తేలికైనది, ఏది బరువుగా ఉంటుంది అని అడుగుతాడు. అగస్త్యుడు ఆ మూడింటిలో బరువైన బ్యాట్ ను గుర్తిస్తాడు. అంతే కాదు, 5 ఏళ్ల అగస్త్య కూడా బరువైన బ్యాట్‌తో సిక్సర్లు కొడతానని చెప్పాడు. అగస్త్య చెప్పిన ఆన్సర్ తో హార్ధిక్ ఎంతో మురిసిపోయాడు.
Had to get my resident cricket expert Agastya to weigh in on my bat selection 🥰 pic.twitter.com/LlPL1Y6EGj
— hardik pandya (@hardikpandya7) July 25, 2025
