Hardik Pandya: రీఎంట్రీతో అదరహో అనిపించిన ఆల్‌రౌండర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya: హార్దిక్ పాండ్య టీమిండియా మేటీ బ్యాటర్లలలో ఒకడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న స్టార్ ప్లేయర్. ఈ ఏడాదిలో జరిగిన ఆసియా కప్ సూపర్4లో శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా గాయపడిన ఈ స్టార్ ఆల్‌రౌండర్ ఇటీవల కోలుకుని ఫిట్‌నెస్ సాధించాడు. తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ బరిలోకి రీఎంట్రీ ఇచ్చిన హార్దిక్ పాండ్య తన ఫస్ట్ మ్యాచ్‌లో అదరహో అనిపించాడు.
READ ALSO: RGV: ఆర్జీవీ కొత్త సినిమా అప్డేట్.. రిలాక్స్ మోడ్‌లో సూపర్ స్టిల్..
Also Read
- Rain Alert: ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు!
- IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
- Nethanna Bharosa: చేనేతలకు సర్కార్ మరో గుడ్ న్యూస్..
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
ఈ ట్రోఫీలో బరోడా వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఉప్పల్ స్టేడియంలో మంగళవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బరోడా 7 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఈ భారీ టార్గెట్‌ని బరోడా 19.1 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చిన హార్దిక్ పాండ్య (77*; 42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ముందుగా జట్టుకు ఓపెనర్లు విష్ణు సోలంకి (43; 21 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), శాశ్వత్ రావత్ (31; 18 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) అదిరే ఆరంభాన్ని అందించారు. వన్‌డౌన్ బ్యాటర్ శివాలిక్ వర్మ (47; 31 బంతుల్లో) కూడా రాణించాడు.
పంజాబ్ బ్యాటర్లలో కెప్టెన్ అభిషేక్ శర్మ (50; 19 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) సూపర్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అలాగే అన్మోల్‌ప్రీత్ సింగ్ (69; 32 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), నమన్ ధీర్ (39; 28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు కూడా మంచి ప్రదర్శన చేశారు. బరోడా బౌలర్లలో రాజ్ లింబానీ 3, రసిఖ్ సలామ్, హార్దిక్ పాండ్య, అతిత్ షెత్ ఒక్కో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన హార్దిక్ పాండ్య ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇదే ఉత్సాహంతో పాండ్య డిసెంబర్ 9 నుంచి సౌతాఫ్రికాతో మొదలుకానున్న టీ20 సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు.
READ ALSO: Trump House: అమ్మకానికి అమెరికా అధ్యక్షుడి ఇల్లు.. విలువ ఎంతో తెలుసా!
తాజావార్తలు
-
Chandu Mondeti : టాలీవుడ్, బాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ లాక్..?
-
UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
-
Rain Alert: ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు!
-
IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
-
Nethanna Bharosa: చేనేతలకు సర్కార్ మరో గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!