Site icon NTV Telugu

Hardik Pandya: కొడుకు అగస్త్యతో హార్దిక్ పాండ్యా..(వీడియో)

Hardik

Hardik

Hardik Pandya: శ్రీలంకతో వన్డే, టీ20 మ్యాచ్‌ల తర్వాత భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడుతోంది. దీని ప్రకారం సెప్టెంబర్ 19న చెన్నైలోని చెపాక్ మైదానంలో తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఇందులో బంగ్లాదేశ్ జట్టుపై భారత జట్టు 280 పరుగుల తేడాతో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలోనే భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవి 2020లో వివాహం చేసుకున్నారు. వీరికి అగస్త్య అనే కుమారుడు ఉన్నాడు. 2024 జూలై 19న వారు విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. దీని తరువాత, అగస్త్య షీనా తల్లి నటాషాతో కలిసి విదేశాలలో ఉన్నాడు.

Gudem Mahipal Reddy: పటాన్ చెరువు డీఎస్పీ పై డీజీపీకి ఫిర్యాదు చేస్తా.. గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం..

ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా తన భార్యతో విడాకులు తీసుకున్న చాలా కాలం తర్వాత ఇప్పుడు అగస్త్యను కలిశాడు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వైరల్ వీడియోలో, హార్దిక్ పాండ్యా తన కొడుకు అగస్త్యను ఎత్తుకొని అతను కూడా ఓ చిన్న పిల్లాడిలా మారిపోయాడు. దీన్ని చూసిన అభిమానులు ఉత్సాహంగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. 2018లో చివరిసారిగా భారత్ తరఫున టెస్ట్ మ్యాచ్ ఆడిన పాండ్యా, నవంబర్, డిసెంబర్‌ నెలలో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు బరోడా తరఫున ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో ఆడాలని భావిస్తున్నాడు.

Exit mobile version