NTV Telugu Site icon

Hardik-Natasha: రెండోసారి పెళ్లి..ఫుల్లుగా తాగి చిందేసిన హార్దిక్-నటాషా

Pan

Pan

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తన భార్య నటాషా స్టాంకోవిచ్‌ను హార్దిక్ రెండోసారి మనువాడాడు. ప్రేమికుల దినోత్సవం(ఫిబ్రవరి 14) నాడు రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌ కోటలో వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు కుమారుడు అగస్త్య సమక్షంలో హార్దిక్-నటాషా వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారాయి. అయితే ఈ వేడుక అనంతరం హార్దిక్-నటాషా ఫ్రెండ్స్‌కు గ్రాండ్‌ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో ఫుల్లుగా తాగిన పాండ్యా-నటాషా మైకంతో చిందులేశారు. లోకం తెలియకుండా డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరో వీడియోలో పాండ్యా మైఖేల్ జాక్సన్ స్టెప్పులు వేసి అలరించాడు.

రెండేళ్ల క్రితమే హార్దిక్-నటాషాకు వివాహం జరిగింది. లాక్‌డౌన్ సమయంలో సహజీవనం చేసిన ఈ ఇద్దరూ నటాషా గర్బం దాల్చిన తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వీరికి 2020 జూలైలో కుమారుడు అగస్త్య జన్మించాడు. ఇక అప్పుడు వేడుకగా పెళ్లి చేసుకోలేకపోయామనే లోటు తీర్చేందుకు భార్యకు ఈ మేరకు వాలంటైన్స్‌ డే గిఫ్ట్‌ ఇచ్చాడు హార్దిక్‌. అయితే రెండోసారి పెళ్లి చేసుకొని హార్దిక్-నటాషా డబ్బులు వృథా చేశారని, ఎవరికైనా సాయం చేసినా బాగుండేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా టెస్టు సిరీస్ ఆడుతుండటంతో బ్రేక్‌లో ఉన్న హార్దిక్ .. కుటుంబ సభ్యులతో ఈ విరామ సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు.

Also Read: Womens T20 WorldCup: ప్రపంచకప్‌లో స్పాట్ ఫిక్సింగ్ కలకలం