Site icon NTV Telugu

Natasa Stankovic: ముంబైలో హార్దిక్ మాజీ భార్య నటాషా స్టాంకోవిక్.. బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు! (వీడియో)

Natasa Stankovic

Natasa Stankovic

Natasa Stankovic and Aleksandar Ilic in Mumbai: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిక్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. విడాకుల తర్వాత సొంత దేశం సెర్బియాకు నటాషా వెళ్లిపోయారు. అక్కడే తన కుమారుడు అగస్త్య నాలుగో బర్త్‌డేను ఘనంగా నిర్వహించారు. ఆ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. దాదాపు రెండు నెలల పాటు సెర్బియాలోనే ఉన్న నటాషా.. గతవారం ముంబైలో అడుగుపెట్టారు.

ముంబైలో దిగగానే కుమారుడు అగస్త్యను తన మాజీ భర్త హార్దిక్ పాండ్యా వద్ద వదిలిన నటాషా స్టాంకోవిక్.. బాయ్‌ఫ్రెండ్‌ అలెక్సాండర్‌ ఇలాక్‌తో కలిసి ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. వైట్‌ జాకెట్‌ వేసుకున్న నటాషా.. రాత్రి వేల ఓ జిమ్‌ వద్ద ఫొటోగ్రాఫర్లకు చిక్కారు. అలెక్సాండర్‌ చీర్స్ చెబుతూ ఫొటోలకు పోజులిచ్చాడు. అనంతరం నటాషా స్వయంగా కారును డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read: IND vs BAN: భారత్-బంగ్లా మ్యాచ్‌కు సర్వం సిద్ధం.. వేదికను మార్చే ప్రసక్తే లేదు: బీసీసీఐ

మే 2020లో హిందూ సంప్రదాయం ప్రకారం హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిక్ వివాహం చేసుకున్నారు. ఫిబ్రవరి 2023లో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం రెండోసారి పెళ్లాడారు. ఏడాది తిరగకముందే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. జులై 2024లో విడిపోతున్నట్టు ప్రకటించారు. అలెక్సాండర్‌ ఇలాక్‌తో నటాషా ప్రేమాయణం నడుస్తున్నారు. మరోవైపు హార్దిక్ గురించి చాలానే రూమర్లు వస్తున్నాయి. గాయని జాస్మిన్ వాలియాతో హార్దిక్ డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

Exit mobile version