తెలుగు క్రికెటర్ హనుమ విహారి పట్టుదల ఎలాంటిదో మనం గత ఆస్ట్రేలియా పర్యటనలో చూశాం. ఆసీస్ పేసర్లకు తన శరీరాన్నే అడ్డుపెట్టి ఇండియన్ టీమ్‌ను ఆదుకున్న తీరు క్రికెట్ ఫ్యాన్స్ అంత త్వరగా మర్చిపోరు. ఇప్పుడు విహారి తన డెడికేషన్ ఎలాంటిదో మరోసారి నిరూపించాడు. రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో తన మణికట్టు విరిగినా అతడు బ్యాటింగ్‌కు దిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్ రెండో రోజు బుధవారం (ఫిబ్రవరి 1) 9వ వికెట్ పడిన తర్వాత విహారి బ్యాటింగ్‌కు దిగడం చూసి ప్రేక్షకులు నోరెళ్లబెట్టారు.
Hanuma Vihari one handed batting due to fracture his wrist.#HanumaVihari #INDvsAUSpic.twitter.com/t9hVDTRMmY
— Drink Cricket 🏏 (@Abdullah__Neaz) February 1, 2023
ఎందుకంటే.. అంతకుముందు తొలి రోజే ఎంపీ బౌలర్ ఆవేష్ ఖాన్ బౌలింగ్‌లో విహారి గాయపడ్డాడు. తర్వాత స్కానింగ్‌లో మణికట్టు విరిగినట్లు తేలింది. అప్పటికే విహారి 16 పరుగులతో ఉన్నాడు. ఇక రెండో రోజు టీమ్ 9వ వికెట్ పడిన తర్వాత అతడు మరోసారి క్రీజులోకి వచ్చాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన విహారి.. లెఫ్టాండ్‌తో బ్యాటింగ్ చేశాడు. కేవలం తన కుడిచేతిని మాత్రమే వాడుతూ బౌలర్లను అడ్డుకున్నాడు. అంతేకాదు ఆ ఒంటిచేత్తోనే ఆవేష్ ఖాన్ బౌలింగ్ లోనే ఓ ఫోర్ కూడా కొట్టడం విశేషం. తన స్కోరుకు మరో 11 పరుగులు జోడించి 27 రన్స్ దగ్గర చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. అయితే అంత గాయంతోనూ విహారి ఆడిన తీరు చాలా మందిని ఆకట్టుకుంది.
What a champion. Always putting team ahead of himself. Shows the commitment. Super proud of you bro. @Hanumavihari #AndhravsMP pic.twitter.com/NTRBh3dCfk
— Basanth Jain (@basanthjain) February 1, 2023
ఆంధ్రా టీమ్ తరఫున రిక్కీ భుయ్, కరణ్ షిండే సెంచరీలు చేయడంతో ఆ టీమ్ తొలి ఇన్నింగ్స్ లో 379 రన్స్ కు ఆలౌటైంది. గతేడాది వరకూ ఇండియన్ టెస్ట్ టీమ్ లో రెగ్యులర్ మెంబర్‌గా ఉన్న విహారి.. శ్రేయర్ అయ్యర్ రాకతో క్రమంగా చోటు కోల్పోయాడు. రాబోయే ఆస్ట్రేలియా సిరీస్‌కు కూడా అతనికి జట్టులో చోటు దక్కలేదు. తాజాగా గాయంతో అతడు బ్యాటింగ్ చేసిన తీరు చూసి నెటిజన్లు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒంటిచేత్తో అతడు ఆడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Michael Jackson: ఇన్నాళ్లకు మైకేల్ జాక్సన్ బయోపిక్.. హీరో ఎవరంటే..?