Site icon NTV Telugu

Hanamkonda Crime: కూతురి సహాయంతో భర్తను హత్య చేసిన భార్య.. పోలీసులకు ఫోన్ చేసి..!

Pedda Pendyala Murder

Pedda Pendyala Murder

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న భర్తను భార్య హతమార్చింది. కూతురి సహాయంతో భర్త మెడకు చీర బిగించి హత్య చేసింది. ఆపై పోలీసులకు ఫోన్ చేసి తన భర్తను చంపేశానని చెప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో మృతుడి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలకు చెందిన అశోక్, యాదలక్ష్మిలు 14 ఏళ్ల కింద ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో పనిచేస్తూ.. వారానికి ఒకసారి అశోక్ ఇంటికి వెళ్లేవాడు. యాదలక్ష్మి పెద్దపెండ్యాలలో కూలీ పనులు చేస్తూ.. పిల్లల్ని చూసుకుంటోంది. అశోక్ దసరా పండగ కోసం పెద్దపెండ్యాలలోని ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో భార్య ప్రవర్తనతో అనుమానం వచ్చింది. వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలిసి భార్యతో గొడవపడ్డాడు.

Also Read: Maoist Asanna: ఇది లొంగుబాటు కాదు.. మావోయిస్టు అగ్రనేత ఆశన్న చివరి ప్రసంగం!

అప్పటినుంచి అశోక్ నిన్న మద్యం మత్తులో ఇంటికి వచ్చి యాదలక్ష్మితో గొడవ పడేవాడు. గత రాత్రి కూడా ఇద్దరు గొడవ పడ్డారు. మద్యం మత్తులో ఉన్న భర్త మెడకు కూతురి సహాయంతో చీర బిగించి భార్య హత్య చేసింది. ఆపై పోలీసులకు ఫోన్ చేసి తన భర్తను చంపేశానని సమాచారం ఇచ్చింది. మృతుడు అశోక్ తండ్రి వెంకటయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అశోక్ చెల్లెలు తన వదినపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అభంశుభం తెలియని తన అన్నను అన్యాయంగా పొట్టన పెట్టుకుందని, యాదలక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.

Exit mobile version