Hamirpur: కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన.. ఆరుగురు మృతి.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hamirpur Bridge Collapse: ఉత్తరప్రదేశ్‌లోని హమీర్పూర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బేత్వా నదిపై మొరాకందర్, కందౌర్ గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఈ వంతెన శుక్రవారం తెల్లవారుజామున కూలిపోవడంతో ఆరుగురు కార్మికులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండవచ్చని భావిస్తున్న నేపథ్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
అధికారుల సమాచారం ప్రకారం.. గురువారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం, ఈదురుగాలులు వీచాయి. ఈ సమయంలో వంతెనలోని ఒక భాగంపై నిద్రిస్తున్న కార్మికులపై నిర్మాణ భాగం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో అక్కడే పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, SDRF బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.
Also Read
- Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
హమీర్పూర్ అదనపు ఎస్పీ అర్వింద్ కుమార్ వర్మ మాట్లాడుతూ.. రాత్రి సుమారు 2 గంటల సమయంలో వంతెన స్లాబ్ కూలిపోయిందని సమాచారం అందిందన్నారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టామని తెలిపారు. ఇప్పటివరకు ఐదుగురు మృతదేహాలను వెలికితీసి గుర్తించినట్లు చెప్పారు. ఇంకా శిథిలాల కింద కార్మికులు చిక్కుకుని ఉండే అవకాశం ఉందని వెల్లడించారు.
ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లా యంత్రాంగం, SDRF సమన్వయంతో సహాయక చర్యలను వేగవంతం చేయాలని సూచించారు.
#WATCH | Hamirpur, Uttar Pradesh: Under-construction bridge collapses due to severe storm. Five workers killed, several others feared trapped. pic.twitter.com/Q9RgKxg6bj
— ANI (@ANI) May 29, 2026
తాజావార్తలు
-
Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
-
Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!