Site icon NTV Telugu

Hamas: ఇజ్రాయెల్ యుద్ధం ఆపితే ఒప్పందానికి రెడీ.. కారణమిదేనా!

Hamas

Hamas

గత కొద్ది రోజులుగా హమాస్-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే హమాస్ లక్ష్యంగా గాజాను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఇప్పుడు రఫాను టార్గెట్ చేసుకుని వార్ కొనసాగిస్తోంది. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ యుద్ధం మాత్రం ఆగలేదు.

ఇది కూడా చదవండి: Splendor Plus xtec 2.0 Price: ‘స్ల్పెండర్‌’ కొత్త వెర్షన్‌ విడుదల.. ధర, మైలేజ్ ఎంతంటే?

గడిచిన 24 గంటల్లో ఇజ్రాయెల్‌ దాడుల్లో 53 మంది మృతి చెందగా మరో 357 మంది గాయపడ్డారని స్థానిక ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్‌ భీకర దాడుల నేపథ్యంలో హమాస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. గాజా పౌరులపై దాడులు ఆపేస్తే.. ఇజ్రాయెల్‌తో తాము పూర్తి ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు హమాస్‌ మలిటెంట్లు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అదే విధంగా తమ దగ్గర ఉన్న ఇజ్రాయెల్‌ బంధీలను సైతం వెంటనే వదిలేస్తామని ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Warangal: నిండు ప్రాణాన్ని బలిగొన్నరెండు ప్రైవేట్ ఆస్పత్రులు

ఇటీవల అంతర్జాతీయ న్యాయస్థానం కూడా తక్షణమే గాజాలో దాడులు ఆపాలని ఆదేశించింది. కానీ అవేమీ పట్టించుకోకుండా ఇజ్రాయెల్‌ దక్షిణ గాజాలోని రఫా నగరంపై విరుచుకుపడింది. ఈ క్రమంలో రఫా నగరంలో తల దాచుకుంటున్న అమాయక పాలస్తీనా పౌరులు మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే హమాస్‌ వెనక్కి తగ్గి ఇజ్రాయెల్‌తో ఒప్పందానికి సిద్ధపడినట్లు సమాచారం.

అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడులకు తెగబడింది. ఇజ్రాయెలీయులను బందీలు తీసుకునిపోయింది. మరికొందర్ని చంపేశారు. దీంతో ఇజ్రాయెల్ పగతో రగిలిపోయింది. ఆనాటి నుంచి హమాస్ లక్ష్యంగా దాడులు చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్‌కు మద్దతు ఉపసంహరించుకోవాలని అమెరికాలో పాలస్తీనా విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. తాజాగా రఫాలో జరిగిన దాడి తర్వాత సినీ సెలబ్రిటీలు కూడా రఫాకు మద్దతు ప్రకటించారు. పలువురు విమర్శల ఫాలయ్యారు. ఇప్పటివరకు ఇజ్రాయెల్‌ చేసిన దాడుల్లో 36,171 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు.

ఇది కూడా చదవండి: CPI Narayana: తెలంగాణలో రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నాడు

Exit mobile version