జుట్టు ఒత్తుగా అందంగా ఉండాలని చాలా మంది అనుకుంటారు.. కానీ ఈ రోజుల్లో కొత్తగా జుట్టు పెరగడం ఏమో గానీ ఉన్న జుట్టు ఊడిపోతుంది.. జుట్టు రాలడం పెద్ద సమస్యగా మారింది..పెరిగిపోతున్న కాలుష్యం, మారుతున్న జీవన విధానం, చెడు ఆహార అలవాట్లు, ఒత్తిడి, అనారోగ్య సమస్యలు కారణంగా.. జుట్టు వూడిపోవడం, పలుచగా అయిపోవడం.. వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. హెయిర్ ఫాల్‌ను తగ్గించుకోవడానికి మందులు, రకరకాల షాంపూలు వాడుతుంటారు, ఏవేవో ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు.. దానికి బదులుగా ఇంట్లో దొరికే వాటితో హెయిర్ ఫ్యాక్ వేసుకుంటే అందమైన జుట్టు మీ సొంతం.. ఎటువంటి ఫ్యాక్స్ వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
తమలపాకులో యాంటీమైక్రోబియల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి జుట్టును ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. పది తమలపాకులకు తగినంత నీటిని కలిపి మిక్సీలో వేసి పేస్టు చేయాలి. ఇందులో మూడు చెంచాల నెయ్యి, చెంచాన్నర తేనె వేసి మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని తలకు, జుట్టుకు ప్యాక్‌లా అప్లై చేసి అరగంట పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే.. హెయిర్ ఫాల్ తగ్గి.. ఒత్తుగా పెరుగుతుంది…
ఉల్లిపాయను మిక్సీ పట్టి, రసం వడకట్టాలి. ఆపై దాన్ని మాడుకి పట్టించి, పావుగంటయ్యాక గోరువెచ్చని నీటితో తలస్నానం చేయండి. దీనిలో ఉండే సల్ఫర్ కుదుళ్లను ఆరోగ్యవంతం చేసి, కురులు వేగంగా పెరిగేలా సాయపడుతుంది.. ఇది కూడా వారానికి రెండు మూడుసార్లు పట్టిస్తే చాలా మంచిది..
కలబందలో జుట్టు సంరక్షణ పోషకాలు అధికంగా ఉంటాయి.. తాజాగా తీసుకున్న కలబంద గుజ్జును జుట్టుకు అప్లై చేసుకోండి. గంటయ్యాక గాఢత తక్కువున్న షాంపూతో తలస్నానం చేస్తే సరి. మాడు పొడిబారడం, చుండ్రు, ఇన్ఫెక్షన్లు వంటివి తగ్గి జుట్టు ఒత్తుగా అందంగా పెరుగుతుంది..
కాఫీ శిరోజాల ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. చెంచా కాఫీ పొడికి రెండు విటమిన్ ఈ క్యాప్సుల్స్ కలిపి మాడుకు లేపనంలా రాసి అరగంట ఆరనివ్వాలి.. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో తల స్నానం చేస్తే మంచిది.. జుట్టు ఒత్తుగా అందంగా పెరుగుతుంది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.