World Record: నిజంగా మనోడు భీముడే భయ్యా. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరూ లిఫ్ట్ చేయనంత బరువును మోసి ప్రపంచ రికార్డ్‌ను నెలకొల్పాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి అని ఆలోచిస్తున్నారా.. హాఫ్థోర్ బ్జోర్న్‌సన్. అదే బాస్ ప్రముఖ ఫాంటసీ డ్రామా సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో గ్రెగర్ క్లెగేన్ అకా ‘ది మౌంటైన్’ పాత్రకు ప్రసిద్ధి చెందిన వ్యక్తి. తాజాగా ఆయన డెడ్‌లిఫ్ట్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. బర్మింగ్‌హామ్‌లో జరిగిన స్ట్రాంగ్‌మ్యాన్ 2025 పోటీలో 510 కిలోగ్రాములు (1,124 పౌండ్లు) ఎత్తి ఔరా అనిపించాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆయన గతంలో 505 కిలోగ్రాముల (1,113 పౌండ్లు) ఎత్తి లిఖించున్న తన రికార్డును తాజాగా తానే బద్దలు కొట్టాడు. వాస్తవానికి వెయిట్ లిఫ్టింగ్‌లో ఆయన 2018లో ప్రపంచంలోనే అత్యంత బలమైన వ్యక్తిగా ఎంపికయ్యాడు.
READ ALSO: WhatsApp కొత్త అప్‌డేట్.. AI ఆధారిత బ్యాక్‌గ్రౌండ్‌తో మరింత Personalized వీడియో కాల్ అనుభవం!
బ్జోర్న్‌సన్ ఖాతాలో 32 అంతర్జాతీయ విజయాలు, 129 ప్రపంచ రికార్డులు ఉన్నాయి. చరిత్రలో అత్యంత బలమైన వ్యక్తుల్లో మనోడు మూడవ వాడిగా రికార్డ్ సృష్టించాడు. ఇప్పటివరకు జీవించిన అత్యంత బలమైన అథ్లెట్‌గా రికార్డ్ తన పేరు మీద బ్జోర్న్‌సన్ లిఖించుకున్నాడు. 199 కిలోల మ్యాన్ మౌంటైన్‌ను ఒకే క్యాలెండర్ ఇయర్‌లో ఆర్నాల్డ్ స్ట్రాంగ్‌మ్యాన్ క్లాసిక్, యూరప్స్ స్ట్రాంగెస్ట్ మ్యాన్, వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ టైటిళ్లను గెలుచుకున్న ఏకైక వ్యక్తిగా ప్రపంచ రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు.
420 తో మొదలు పెట్టి 510 తో ముగించాడు..
* పోటీలో మొదట 420 కిలోల బరువుతో ప్రారంభించాడు.
* తర్వాత రెండవ సారి 470 కిలోలతో ముందుకు వెళ్లాడు..
* చివరి ప్రయత్నంగా 510 కిలోల బరువు ఎత్తి.. గతంలో తన పేరు మీద ఉన్న రికార్డ్‌ను తానే మళ్లీ తిరగరాశాడు.
