NTV Telugu Site icon

Gyanvapi mosque survey: జ్ఞానవాపీ మసీదు సర్వే… వారణాసిలో భద్రత కట్టుదిట్టం

Gyanvapi Mosque

Gyanvapi Mosque

దేశంలో ప్రస్తుతం జ్ఞానవాపి మసీదు వివాదంపై చర్చ జరుగుతోంది. వారణాసి కోర్ట్ దేశాలతో ఈ రోజు కోర్ట్  కమిషనర్ టీం జ్ఞానవాపి మసీదును వీడియోగ్రఫీ చేయనున్నారు. దీంతో వారణాసి వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. మసీదు పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. మసీదుకు చుట్టూ 500 మీటర్ల వరకు ఉన్న అన్ని దుకాణాలను మూసివేయబడ్డాయి. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

గురువారం జ్ఞానవాపి మసీదు పై వారణాసి కోర్ట్ కీలక తీర్పు వెల్లడించింది. మసీదును సర్వే చేయాలని తీర్పు వెల్లడించింది. దీనికి కోర్ట్ కమిషనర్ అజయ్ మిశ్రాతో పాటు మరో ఇద్దరు న్యాయవాదులను కమిషనర్లుగా నియమించారు. మసీదు లోపలి భాగాలను సర్వే చేయాలని కోర్ట్ ఆదేశించింది. పూర్తిగా వీడియోగ్రఫీ చేసి మే 17 వరకు నివేదిక ఇవ్వాలని కోర్ట్ ఆదేశించింది. ఓ వర్గం వారు వీడియోగ్రఫీని ఆపాలని పిటిషన్ వేయగా… కోర్ట్ మాత్రం సర్వేకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

 

దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓ వర్గం వారు మసీదులో సర్వే చేయడాన్ని వ్యతిరేఖిస్తుండగా… మరో వర్గం వారు ఆలయాన్ని కూల్చి మసీదు కట్టారని.. ఇప్పటికీ మసీదులో కొన్ని దేవతా విగ్రహాలు ఉన్నాయని.. తమకు ఆ మసీదును అప్పగించాలని కోరతున్నారు. ఈ నేపథ్యంలో కోర్ట్ వీడియోగ్రఫీకి అనుమతి ఇవ్వడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

మొగల్ చక్రవర్తుల పాలన సమయంలో ఔరంగబేబు జ్ఞానవాపి ఆలయాన్ని మసీదుగా మార్చారని వాదనలు ఉన్నాయి. అయితే ఇందుకు నిజం చేకూర్చే విధంగా మసీదు వెనకభాగంలో కొన్ని దేవతా విగ్రహాలు ఉన్నట్లుగా మరోవర్గం వారు చెబుతున్నారు. ఇదిలా ఉంటే జ్ఞానవాపి మసీదు సర్వేపై ముస్లిం మతపెద్దలు, రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే బాబ్రీని కోల్పోయాం…మరో మసీదును కోల్పోవడానికి సిద్ధంగా లేమని అన్నారు. వారణాసి కోర్ట్ తీర్పు సుప్రీం కోర్ట్ తీర్పుకు వ్యతిరేఖంగా ఉందని విమర్శించారు. యోగీ ఆదిత్య నాథ్, బీజేపీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు.