Madhya Pradesh: తమ స్నేహితులతో కలిసి చికెన్ తినేందుకు వెళ్లిన కొందరు యువకులు షాపు యజమానిని కొట్టిన షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వారు తందూరి ముర్గా (డిష్)ని ఆర్డర్ చేశారు. కానీ దుకాణ యజమాని దానిని వడ్డించడానికి నిరాకరించడంతో కోపోద్రిక్తులైన యువకులు అరుపులు, అల్లర్లు ప్రారంభించారు. ఆ తర్వాత షాపు యజమానిని కూడా కొట్టినట్లు వెలుగులోకి వచ్చింది. అంతేకాదు యజమానిని కూడా కారులో కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Read Also:Delhi: భవన నిర్మాణ కార్మికులకు శుభవార్త చెప్పిన ఢిల్లీ ప్రభుత్వం
ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటుచేసుకుంది. సోమవారం రాత్రి కొందరు యువకులు కారులో నగరంలోని పంజాబీ చికెన్ సెంటర్‌కు వచ్చారు. తందూరీ చికెన్ డిష్ ఆర్డర్ చేసి కారులో తాగడం మొదలుపెట్టారు. అయితే షాపు ముందు మద్యం సేవించవద్దని దుకాణం యజమాని చెప్పడంతో తిట్టడం మొదలుపెట్టారు. చివరకు చికెన్ సెంటర్ యజమాని చికెన్ ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో కోపోద్రిక్తులైన యువకులు అరుపులు, వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలోనే తలపై మద్యం సీసా పగలగొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దుకాణ యజమానిని ఆస్పత్రికి తరలించగా తలపై ఎనిమిది గాట్లుపడ్డాయి. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Also:IND vs PAK: ఎంత ప్రయత్నించినా.. భారత్-పాకిస్తాన్ ఫైనల్ ఆడవు! చరిత్రలోనే లేదు
చికెన్ సెంటర్ యజమాని అల్లరిమూకలను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో దుండగులు తోపులాటకు దిగారు. ఈ గొడవలో నిందితుడు బీరు బాటిల్‌తో తలపై కొట్టి బలవంతంగా కారులోకి ఎక్కించే ప్రయత్నం చేశాడు. అయితే అతడు విఫలం కావడంతో దొంగలు పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.