NTV Telugu Site icon

Gv Prakash: విడాకులు తీసుకున్న మరో హీరో.. పోస్ట్ వైరల్..

Gvp

Gvp

ప్రముఖ సంగీత డైరెక్టర్, హీరో జీవి ప్రకాష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు… సినిమా రిజల్ట్ తో పనిలేకుండా వరుస సినిమాలను చేసుకుంటూ పోతున్నాడు.. ఏడాదికి నాలుగు, ఐదు సినిమాలు చేస్తున్నాడు.. నాలుగు నెలల గ్యాప్ లోనే మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి.. కొన్ని సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకుంటే మరికొన్ని సినిమాలు మాత్రం ప్లాప్ అయ్యాయి.. అయితే జీవి తాజాగా చేసిన పోస్ట్ ప్రస్తుతం ఓ రేంజులో వైరల్ అవుతుంది..

సినీ ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి అనేవి కామన్.. నచ్చితే కొద్దిరోజులు డేట్ అంటూ తిరుగుతారు.. ఇష్టం ఎక్కువైతే పెళ్లి చేసుకుంటారు. లేకుంటే మాత్రం ఎవరి దారి వాళ్లు చూసుకొని లైఫ్ ను సాగిస్తారు. అంతేకాదు ఇండస్ట్రీలో విడాకులు కూడా ఎక్కువగానే అవుతాయి.. ఇప్పటికే ఎంతోమంది జంటలు విడాకులను తీసుకున్నారు.. మొన్న హీరో ధనుష్ విడాకులు తీసుకోగా, నిన్న జీవి ప్రకాష్ కూడా విడాకులు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

హీరో జీవీ ప్రకాష్ కూడా తన భార్యకు విడాకులు ఇచ్చాడు. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇచ్చాడు. తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ షేర్ చేస్తూ .. ఎంతో ఆలోచించాం. చివరికి విడిపోవాలని నేను, సైంధవి నిర్ణయించుకున్నాం. పరస్పర అంగీకారంతోనే మా విడాకులు.. మా ఈ నిర్ణయాన్ని మీడియా మిత్రులు, అభిమానులు అర్థం చేసుకుంటారని, అలాగే మా ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నాం. మా నిర్ణయం ఇద్దరికి మంచిదని భావించిన తర్వాతే విడాకులకు సిద్ధమయ్యాం.. అని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతుంది..

View this post on Instagram

 

A post shared by G.V.Prakash Kumar (@gvprakash)

Show comments