Guru Nanak University: హైదరాబాద్ లోని గురునానక్ యూనివర్సిటీ ఓరియెంటెషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించింది కాలేజీ యాజమాన్యం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ యూనివర్సిటీలో నూతనంగా 2025-26 విద్యా సంవత్సరం విద్యను అభ్యసించేందుకు జాయిన్ అయిన విద్యార్థులకు ఓరియెంటెషన్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఏపీ రీజినల్ వైస్ ప్రెసిడెంట్ గిరీష్ బంట్వాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎస్ఎపి (SAP) పైననే ఎక్కువగా ట్రాన్సక్షన్ జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా 77 శాతం ట్రాన్సక్షన్ లు ఇందులోనే జరుగుతున్నాయి. అందుకోసమే ఎస్ఎపి ఆవశ్యకత ను గుర్తుంచుకొని బీటెక్ లో ఈ ప్రోగ్రామ్ ను గురునానక్ యూనివర్సిటీ ప్రారంభించడం జరుగుతోందన్నారు.
ఇక గురునానక్ యూనివర్సిటీ ఛాన్స్ లర్ సర్దార్ గగన్ దీప్ సింగ్ కోహ్లీ మాట్లాడుతూ.. దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులతో గురునానక్ యూనివర్సిటీలో విద్యానందిస్తున్నామని అన్నారు. ఇంజినీరింగ్ విద్యలోకి ప్రవేశిస్తున్న విద్యార్థులు తాము ఎలాంటి జీవితంలోకి అడుగుపెట్టాలో ఇక్కడే నిర్మితమవుతుంది. తాము ఎంతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నామని అందుకే ఎంతో కష్టపడి చదివి ఇక్కడి నుండి బయటకు ప్రయోజకులుగా వెళ్లాలన్నారు. అందుకోసం మా యూనివర్సిటీ ఎస్ఏపీ, ఐబీఎం (IBM)తో ఒప్పందం చేసుకొని నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందన్నారు.
Samsung Galaxy Buds 3 FE: ANC, AI ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 3 FE లాంచ్!
అలాగే యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ హెచ్.ఎస్. సైని మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి ప్రాంతీయ భాషతో పాటు ఇంగ్లీష్ లో ప్రావీణ్యం పొందాలి. ఇంగ్లీష్ బాగా వస్తే మంచి కంపెనీల్లో, ఇతర దేశాల్లో ఉన్నత ఉద్యోగాలు పొందేందుకు ఆస్కారం వుంటుంది. గురునానక్ విద్యాసంస్థల్లో గత 24 ఏళ్ల నుండి చదివిన విద్యార్థులు ఉన్నత ఉద్యోగాల్లో విదేశాల్లో ఎంతో మంది స్థిరపడ్డారు. ఈ నాలుగు ఏళ్ల సమయం వృధా చేయకుండా విద్యార్థులు నేర్చుకోవాలి. తల్లిదండ్రుల కష్టపడి చదివిస్తున్నారు. వారి కష్టాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. యూనివర్సిటీలో ఉన్న ప్రతి సోర్స్ ను వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గురునానక్ యూనివర్సిటీ అధ్యాపక బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
