సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకేక్కిస్తున్నాడు.. సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరు కారం గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమాలో మహేష్ బాబు మాస్ లుక్స్ కు పిచ్చ క్రేజ్ వచ్చింది.. అలాగే గుంటూరు కారం నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా లో మహేష్ బాబుకు జోడీగా శ్రీలీల నటిస్తుంది. అలాగే మరో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుంది. అలాగే ఈ సినిమా లో పవర్ ఫుల్ విలన్ గా జగపతిబాబు నటిస్తున్నాడు..రీసెంట్ గా ఈ మూవీ నుంచి ధమ్ మసాలా అనే సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ అభిమానులకు తెగ నచ్చేసింది.మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తనదైన స్టైల్ లో మ్యూజిక్ అదించి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ క్రేజ్ న్యూస్ బయటకు వచ్చింది.
నిజానికి ధమ్ మసాలా సాంగ్ గుంటూరు కారం లో సీన్స్ బ్యాగ్రౌండ్ లో వస్తుందని సమాచారం.. అయితే ఇప్పుడు ఈ సాంగ్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తుండటంతో ఇప్పుడు ప్లాన్ చేంజ్ చేసినట్లు తెలుస్తుంది.ఈ సాంగ్ ను ఫుల్ సాంగ్ గా ఉంచనున్నారట. అలాగే ఈ పాటకు మేకర్స్ అదిరిపోయే డాన్స్ ను కూడా జోడించనున్నట్లు సమాచారం.నేడు మహేష్ బాబుతో పాటు ఆరు వందల మందితో శేఖర్ మాస్టర్ ఈసాంగ్ ను కొరియోగ్రఫ్ చేయనున్నారని సమాచారం.. అలాగే ఈ సినిమా లో మిగిలిన సాంగ్స్ కూడా సూపర్ గా ఉంటాయని తెలుస్తోంది. అలాగే థమన్ ఈ సినిమాకు అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే సినిమా నుంచి సెకండ్ సాంగ్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఈ సారి మరింతగా ఆకట్టుకునే మెలోడీని రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో రమ్యకృష్ణ, సునీల్ మరియు ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.