NTV Telugu Site icon

Guntur Kaaram : గుంటూరు కారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ డేట్ ఫిక్స్..వేదిక ఎక్కడంటే..?

Whatsapp Image 2024 01 06 At 11.12.31 Pm

Whatsapp Image 2024 01 06 At 11.12.31 Pm

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న థియేటర్ల లో రిలీజ్ కానుంది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేశ్ – త్రివిక్రమ్ కాంబో లో మూడో చిత్రంగా గుంటూరు కారం చిత్రం రూపొందింది.మహేశ్ బాబు చాలాకాలం తర్వాత పూర్తిస్థాయి యాక్షన్ మూవీ చేస్తుండటంతో గుంటూరు కారం సినిమా పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. దీంతో సినిమా పై క్రేజ్ పీక్స్‌ లో ఉంది. యాక్షన్ అవతార్‌ లో మహేశ్‍ ను ఎప్పుడెప్పుడూ చూస్తామా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే జనవరి 6 న ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని, అందులోనే ట్రైలర్ రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ భావించింది. అయితే ఈ ఈవెంట్ కు అనుమతులు రాకపోవడం తో ప్రీ-రిలీజ్ ఈవెంట్ రద్దయింది.

ఈ తరుణం లో ట్రైలర్ కోసం లాంచ్ ఈవెంట్ నిర్వహించాలని గుంటూరు కారం మేకర్స్ డిసైడ్ అయ్యారు.గుంటూరు కారం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రేపు (జనవరి 7) జరగనుందని సమాచారం. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‍ రోడ్స్ వద్ద ఉన్న సుదర్శన్ థియేటర్లో గుంటూరు కారం ట్రైలర్ లాంచ్ జరుగుతుందని తెలుస్తోంది. ఈ విషయం పై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. గుంటూరు కారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍ను రేపు (జనవరి 7) సాయంత్రం సుమారు 5 గంటల సమయం లో నిర్వహించేందుకు సుదర్శన్ థియేటర్ వద్ద ఏర్పాట్లు కూడా జోరుగా సాగుతున్నాయి.సుదర్శన్ థియేటర్ వద్ద మహేశ్ బాబు భారీ కటౌట్‍ ను అభిమానులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అక్కడ ఎంతో కోలాహలంగా వుంది.ట్రైలర్ రేపు సాయంత్రం విడుదల కానుండటం తో అభిమానులు తెగ సందడి చేస్తున్నారు..

Show comments