Site icon NTV Telugu

Guntur Kaaram : ఆ ట్యూన్ కాపీ అంటూ మళ్ళీ థమన్ పై ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

Whatsapp Image 2023 12 30 At 8.44.29 Pm

Whatsapp Image 2023 12 30 At 8.44.29 Pm

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో శ్రీలీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో మూడో మూవీ కావటంతో ఈ చిత్రంపై క్రేజ్ భారీగానే ఉంది. హాసిని అండ్ హారిక క్రియేషన్స్ పతాకం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల అయిన రెండు పాటలు మంచి ఆదరణ పొందాయి. తాజాగా నేడు గుంటూరు కారం సినిమా నుంచి ‘కుర్చీ మడతపెట్టి’ పూర్తి పాట వచ్చేసింది. అయితే, ప్రోమో నుంచే ఈ పాటపై తెగ రచ్చ జరుగుతోంది.మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాలో ఇలాంటి పాటనా అని కొందరు.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ పాటకు ఎలా ఓకే చెప్పారో అర్థం కావడం లేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, మాస్ యాక్షన్ మూవీలో ఈ పాట ఉండడం సరైనదే అని కొందరు సమర్థిస్తున్నారు. ఈ చర్చల మధ్య నేడు గుంటూరు కారం సినిమా నుంచి ‘కుర్చీ మడతపెట్టి’ పుల్ రిలికల్ సాంగ్ వచ్చింది. అయితే, ఈ పాట కోసం మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఓ ట్యూన్ కాపీ కొట్టేశాడంటూ కొందరు నెటిజన్లు వీడియోలతో సహా పోస్ట్ చేస్తున్నారు.

‘కుర్చీ మడత పెట్టి’ పాట చరణంలో ‘ఏం రసికరాజువో’ మరి అంటూ లిరిక్స్ ఉన్నాయి. అయితే, అక్కడ అత్తారింటికి దారేది సినిమాలోని ‘బేట్రాయి సామి దేవుడా’ జానపద పాట ట్యూన్‍ను థమన్ కాపీ కొట్టాడని కొందరు నెటిజన్లు అంటున్నారు. ఆ పాటను.. ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్‍ను కలిపి వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అత్తారింటికి దారేది ట్యూన్‍ను థమన్ కొట్టేశాడంటూ పోస్టులు చేస్తూ థమన్‍ను తెగ ట్రోల్ చేస్తున్నారు.ఇప్పటికే ‘కుర్చీ మడతపెట్టి’ పాట కోసం డీజే పాటలను కాపీ కొట్టారంటూ ప్రోమో చూసినప్పుడు థమన్‍పై కొందరు ఆరోపించారు. ఇప్పుడు ఫుల్ సాంగ్ రావటంతో ‘బేట్రాయి సామిదేవుడా’ ట్యూన్‍ను కూడా కొట్టేశావంటూ తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

Exit mobile version