Guntur Murder: తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నదని సొంత చెల్లి, బావపై పగబట్టాడు.. పెళ్లి చేసుకున్నప్పటినుంచి చపుతానంటూ బెదిరించేవాడు… చివరకు అనుకున్నంత పని చేశాడు… బావను నడిరోడ్డుపై అత్యంత దారుణంగా హత్యచేశాడు బావమరిది.. దీంతో కసాయి బావమరిదిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు మృతుడి కుటుంబ సభ్యులు.. ఎత్తు తక్కువ ఉన్న(పొట్టి) వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కారణంతో నడి రోడ్డు చెల్లి భర్తను పొడిచి చంపాడని మృతుడి బంధువులు చెబుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ ఘటన గుంటూరులో చోటు చేసుకుంది.
READ MORE: BC Reservations : బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు విచారణ వాయిదా .. ట్రిపుల్ టెస్ట్ పై చర్చ..
కుటుంబీకుల కథనం ప్రకారం.. గణేష్, అంజలీదేవికి పెళ్లి చూపులు జరిగాయి. పెళ్లి చూపుల్లో అమ్మాయి కంటే అబ్బాయి ఎత్తు తక్కువగా ఉన్నాడని ఆమె తల్లిదండ్రులు తిరస్కరించారు. కానీ ఆ అమ్మాయి అతనే కావాలని పెళ్లి చేసుకుంది. దీంతో పగబట్టిన ఆమె అన్న దుర్గారావు అప్పటి నుంచి అతన్ని చంపుతానని బెదిరించేవాడని… చివరకు ఈ రోజు గుంటూరులో నడి రోడ్డుపై గణేష్ ను కత్తితో పొడిచి చంపాడు దుర్గారావు. గణేష్‌ని పొడుస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు సెల్ ఫోన్లో ద్వారా వీడియో తీశారు.
READ MORE: Mallikarjun Kharge: మనుస్మృతి, సనాతన ధర్మం పేరుతో దాడులు సరికాదు.. గవాయ్‌పై దాడిని ఖండించిన ఖర్గే
