Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl Gujarat Titans Vs Chennai Super Kings Today In Ipl 2023 Final

IPL 2023 Final: నేడే ఫైనల్‌.. కప్‌ కొట్టేదెవరు..? ఎవరి బలం ఏంటి..?

Published Date :May 28, 2023 , 9:44 am
By Sudhakar Ravula
IPL 2023 Final: నేడే ఫైనల్‌.. కప్‌ కొట్టేదెవరు..? ఎవరి బలం ఏంటి..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

IPL 2023 Final: క్రికెట్‌ ఫ్యాన్స్‌లో జోష్‌ నింపిన పొట్టి ఫార్మాట్‌ ఐపీఎల్‌ చివరి దశకు చేరుకుంది.. రెండు నెలలుగా క్రికెట్‌ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. చెన్నై పాంచ్‌ పటాకానా? గుజరాత్‌ డబుల్‌ ధమాకానా అనేది ఇవాళ తేలిపోనుంది. ఐపీఎల్‌ 16 సీజన్‌ విజేత ఎవరో ఈ రోజు ఫైనల్‌ కానుంది.. సీనియర్‌ ధోనీ వ్యూహాలు ఫలిస్తాయా? చెన్నై ఫ్యాన్స్‌ కలల్ని సాకారం చేస్తాడా?.. లేకపోతే హార్థిక్‌ పాండ్యా దూకుడుతో గుజరాత్‌కు కప్‌ అందిస్తాడా? అనేది ఇవాళ రాత్రికి తేలిపోనుంది. క్వాలిఫైయర్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో దెబ్బతిన్న గుజరాత్ టైటాన్స్‌ మళ్లీ ఫైనల్‌లో అదే జట్టుతో తలపడి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న ఇరుజట్ల ఫైనల్‌ ఫైట్‌తో అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియం మోతెక్కిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన చెన్నై, గుజరాత్‌ జట్లే ఫైనల్‌లో తలపడనుండడం విశేషం. పదోసారి ఐపీఎల్‌ ఫైనల్‌లోకి అడుగుపెట్టిన చెన్నై సూపర్‌కింగ్స్‌.., ఐదోసారి కప్‌ గెలవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగనుంది. ఇవాళ ఫైనల్‌ గెలిస్తే.., ముంబై ఇండియన్స్‌ రికార్డును సమం చేస్తుంది చెన్నై. గతేడాది లీగ్‌ దశలోనే ఇంటికెళ్లిన చెన్నై ఈసారి పట్టుదలతో, ధోని మార్క్‌ వ్యూహాలతో, సమిష్టి కృషితో ఫైనల్‌కు చేరింది. ఇటు వరుసగా రెండోసారి కప్‌ గెల్చి తమకు తిరుగులేదని నిరూపించుకోవాలకుంటోంది గుజరాత్‌ టీమ్‌. క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో ఈ సీజన్‌లో తలపడిన ప్రతిసారి గుజరాత్‌నే విజయం వరించింది.

ఇక, జట్ల విజయానికి వస్తే.. చెన్నై ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌, డేవన్‌ కాన్వే ఇద్దరూ నిలకడగా రాణిస్తున్నారు. శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, ఆజింక్య రహానెతో మిడిల్‌ ఆర్డర్‌గా పటిష్టంగా ఉంది. రాయుడు కూడా సత్తా చాటుతున్నాడు. ఫినిషర్‌ ధోనీ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిందేమీ లేదు. బౌలింగ్‌లో తుషార్‌ దేశ్‌పాండే, పతిరణ, దీపక్‌చాహర్‌, తీక్షణ, జడేజా సత్తా చాటుతున్నారు. అటు గుజరాత్ ఓపెనర్‌ శుభమన్‌ గిల్‌ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో ఏకంగా మూడు సెంచరీలు కొట్టాడు. గిల్ మరోసారి చెలరేగితే చెన్నైకు కష్టాలు తప్పవు. దీంతో గిల్‌ను త్వరగా ఔట్‌ చేయడంపై దృష్టి సారిస్తోంది ధోనీ టీమ్‌. సాహా, విజయ్‌శంకర్‌, హార్ధిక్‌పాండ్యాలు కూడా రాణిస్తే గుజరాత్‌కు తిరుగుండదు. బౌలింగ్‌లో చెన్నైతో పోలిస్తే గుజరాత్‌ బలంగా ఉంది. షమీ, రషీద్‌ ఖాన్‌, మోహిత్‌ శర్మ దుమ్మురేపుతున్నారు. పర్పుల్‌ క్యాప్‌ రేస్‌లో తొలి మూడు స్థానాల్లో ఉన్నది కూడా ఈ ముగ్గురే. అటు ఆరంజ్‌ క్యాప్‌ ఎలానూ శుభమన్‌ గిల్‌ వద్దే ఉంది. ఓవరాల్‌గా మిస్టర్‌కూల్‌ వ్యూహాలకు హార్ధిక్‌ పాండ్యా ఎలా చెక్‌ పెడతాడో చూడాలి.

ఐపీఎల్‌ ఫైనల్‌లో ఇరు జట్ల మధ్య సమరం మహా సమరాన్ని తలపిస్తుందని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. మరి ధోనీ ఐదోసారి కప్‌ అందుకుంటాడా లేకపోతే పాండ్యా రెండోసారి గుజరాత్‌కు టైటిల్‌ అందించి సక్సెస్‌ ఫుల్‌ కెప్టెన్‌ అనిపించుకుంటాడా అనేది కొన్ని గంటల్లో తేలిపోనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CSK Vs GT
  • Gujarat Titans vs Chennai Super Kings
  • IPL 2023
  • Ipl 2023 final

తాజావార్తలు

  • Off The Record: ఆ ఉమ్మడి జిల్లాల్లో తగ్గిన జనసేన జోష్..!

  • Strait of Hormuz: హర్మూజ్‌ జలసంధిని మూసేసిన ఇరాన్.. ఆయిల్ ధరలు స్కైరాకెట్.. ఈ జలసంధి ఎందుకు ముఖ్యం?

  • Rai Rai Raa Raa : రయ్ రయ్ రా రా అదిరిందిగా!

  • Netanyahu: మానవాళిని బెదిరించాలని చూసింది.. అంతమైంది.. ఇరాన్‌పై నెతన్యాహు హాట్ కామెంట్స్

  • Ugadi Mahotsavam 2026: శ్రీశైలంలో 16 నుంచి ఉగాది మహోత్సవాలు..

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions