మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారక నగరాన్ని దర్శించేందుకు ‘ద్వారకా సబ్ మెరైన్ టూరిజం’ ప్రాజెక్టును గుజరాత్ ప్రభుత్వం చేపడుతున్నట్లు ప్రకటించింది. అరేబియా సముద్రంలో మునిగిపోయిన ఈ సుందర నగరాన్ని చూసేందుకు భక్తులను జలాంతర్గాముల్లో తీసుకెళ్లనున్నట్టు గుజరాత్ సర్కార్ పేర్కొనింది. అయితే, వచ్చే సంవత్సరం శ్రీ కృష్ణ జన్మాష్టమి లేదా దీపావళి పండగ సందర్భంగా సబ్ మెరైన్ యాత్ర స్టార్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. పర్యాటకులను సబ్ మెరైన్లలో తీసుకెళ్లటం దేశ పర్యాటకంలో ఇదే తొలి సారిగా ప్రభుత్వం పేర్కొంది.
Read Also: Pawan Kalyan Kakinada Tour: కాకినాడలో మకాం వేసిన జనసేనాని.. 3 రోజులు అక్కడే
అయితే, అరేబియా సముద్రంలో 300 అడుగుల లోతులో ఉన్న ఆనాటి ద్వారకా నగర కట్టడాలు, పురాతన ఆలయాలను సబ్ మెరైన్ నుంచి భక్తులు చూడొచ్చని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందు కోసం రెండు గంటల దర్శన యాత్రను నిర్వహిస్తున్నట్లు ఆ రాష్ట్ర టూరిజం శాఖ తెలిపింది. దీనికి సంబంధించి ‘మజ్ గావ్ డాక్’ షిప్ యార్డ్ కంపెనీతో గుజరాత్ టూరిజం శాఖ ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. ‘రెండు గంటల పాటు సబ్ మెరైన్ యాత్ర ఉండబోతుందని ప్రకటించింది. 300 అడుగుల లోతుకు వెళ్లి.. ఆనాటి ద్వారక నగరాన్ని కనులారా చూసి రావొచ్చు అని చెప్పింద. ఒక ట్రిప్ లో 24 మంది పర్యాటకులకు ఈ సబ్ మెరైన్ లో తీసుకెళ్తామని గుజరాత్ టూరిజం శాఖ పేర్కొనింది. అందులో ఆరుగురు సిబ్బంది ఉంటారు అని ఆ రాష్ట్ర టూరిజం శాఖ వెల్లడించింది.