GSLV-F14: ఎన్నో ప్రతిష్టాత్మక ప్రయోగాలను తన ఖాతాలో వేసుకున్న ఇస్రో.. ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమైంది.. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్14 రాకెట్ ప్రయోగానికి శ్రీహరికోటలో కౌంట్‌డౌన్ కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం 5 గంటల 35 నిమిషాలకు రాకెట్‌ను ప్రయోగించనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-14 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. నిన్న మధ్యాహ్నం 2 గంటల 5 నిమిషాలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభం కాగా.. అది 27 గంటల 30 గంటల పాటు కొనసాగుతోంది. ఆ తర్వాత ఈ రోజు సాయంత్రం 5.35 గంటలకు 2 వేల 275 కిలోల బరువైన ఇన్‌శాట్-3DS ఉపగ్రహంతో నింగిలోకి దూసుకెళ్లనుంది జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్14 రాకెట్..
Read Also: BJP Meeting: నేటి నుంచి రెండ్రోజుల పాటు బీజేపీ సమావేశాలు.. టార్గెట్ @400
ఈ ప్రయోగం ద్వారా 2 వేల 275 కిలోల బరువైన ఇన్‌శాట్-3DS ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ ఇన్‌శాట్-3 డీఎస్ ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలో మీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశ పెట్టేలా ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని డిజైన్ చేశారు. వాతావరణం, భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించనుంది.. మెరుగైన వాతావరణ పరిశీలనలు, వాతావరణ అంచనా మరియు విపత్తు హెచ్చరికల కోసం భూమి మరియు సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ కోసం రూపొందించబడిన ప్రత్యేకమైన మిషన్ ఇది.. INSAT-3DS ఉపగ్రహం ప్రస్తుతం పనిచేస్తున్న ఇన్‌సాట్-3D మరియు INSAT-3DR ఇన్-ఆర్బిట్ శాటిలైట్‌లతో పాటు వాతావరణ సేవలను పెంపొందిస్తుంది.