NTV Telugu Site icon

Viral Video: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. పెళ్లి సంబరాల్లో చిరిగిపోయిన వరుడి ప్యాంటు!

Viral

Viral

Viral Video: సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పెళ్లికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారడం మనం చూస్తూనే ఉంటాము. పెళ్ళిలో జరిగే వింత సంఘటనలు సంబంధించి అనేక వీడియోలు ఇప్పటికీ మనం చాలానే చూశాను. ఇదే కోవకు చెందిన మరో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ కొత్త జంట వారి వివాహ వేడుకలో ఎంతో సంతోషంగా గడుపుతున్న సమయంలో జరిగిన సంఘటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..

Konda Surekha : కొండా సురేఖకు చిరంజీవి, RGV స్వీట్ వార్నింగ్..!

వైరల్ గా మరిన వీడియోలో.. ఎంతో ఉత్సాహంతో నవ వధువు వధువులు డాన్స్ కోసం డాన్స్ ఫ్లోర్ పైకి రావడానికి చూడవచ్చు. ఆ వధూవరులు ఇద్దరు తమ రొమాంటిక్ స్టైల్ తో అతిధులని మెప్పించాలనే ఉద్దేశంతో తీవ్రంగా ప్రయత్నం చేశారు. వారిద్దరూ డాన్స్ చేస్తున్న సమయంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వరుడు వధువును ఎత్తుకునే ప్రయత్నం చేయగా.. ఒక్కసారిగా వరుడి ప్యాంటు చిరిగిపోయింది. అయితే డాన్స్ లో బిజీగా ఉన్న వరుడు ఆ విషయాన్ని పెద్దగా మొదట్లో పట్టించుకోలేదు. విషయాన్ని గమనించిన వధువు అటువైపు చూసి నవ్వు ఆపుకోలేకపోయింది. ఇలా నవ్వుతున్న వధువు నువ్వు చూసి వరుడి కుటుంబ సభ్యులు వేదిక పైకి పరుగులు తీసి అందరూ వరుడుని చుట్టేసి సభ నుండి దూరంగా తీసుకువెళ్లారు.

Tollywood : మంత్రి కొండా సురేఖకు టాలీవుడ్ నటీనటుల వార్నింగ్..

ఇక ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి బ్రో.. లైట్ తీసుకో., అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.. మరికొందరేమో.., నీలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

Show comments