Bride Cancels Marriage: ప్రతి ఒక్కరికి పెళ్లి అనగానే తమకు కాబోయే వాళ్లు ఇలా ఉండాలనే ఎన్నో ఆశలు పెట్టుకోవడం సర్వసాధారణం. వాళ్ల అంచనాలకు తగ్గట్టుగా ఉంటే సమస్య ఉండదు. కానీ చాలా వరకు అలా కుదరదు. ఒక్కోసారి అంచనాలకు తగ్గట్టుగా ఉండకపోవచ్చు. కొందరూ సర్దుకుని పెళ్లి అయ్యాక వారిని మార్చుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ కొంత మంది అందుకు భిన్నంగా ప్రవర్తిస్తారు.
మరీ ఈ రోజుల్లో యువత గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీదీ స్పీడ్‌గా అయిపోవాలి అనుకుంటారు. ఒకవేళ కాబోయే వాళ్లు నచ్చకపోతే అప్పటికప్పుడు పీటల మీద పెళ్లిని కూడా ఆపేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేస్‌లోని ఫారూఖాబాద్‌లో చోటుచేసుకుంది. ఇంకాసేపట్లో వివాహం జరగనుండగా.. పెళ్లికూతురు ఈ పెళ్లి వద్దంటే వద్దంటూ తెగేసి చెప్పేసింది. అయితే పెళ్లి వద్దనడానికి ఆమె చెప్పిన కారణం వింటే ఆశ్చర్యపోక తప్పదు మరి. ఇంతకు ఆమె చెప్పిందంటే.. ఆ వరుడికి లెక్కలు సరిగా రావని వివాహాన్ని రద్దు చేసింది.
వివరాల్లోకెళ్తే.. గీతా సింగ్ అనే యువతికి, భరత్ అనే యువకుడికి వివాహం నిశ్చయమైంది. మంచి ఘనంగా వివాహ తంతు సాగుతోంది. బంధుమిత్రులందరూ వారి వివాహాన్ని తిలకించి ఆశీర్వచనాలు అందించేందుకు వచ్చారు. కాసేపట్లో పెళ్లి జరగనుండగా.. ఆమె ఈ విషయం చెప్పి అక్కడి వారిని షాక్‌కు గురిచేసింది. ఆమెకు కుటుంబ సభ్యులు నచ్చజెప్పాలని చూసినా ససేమిరా అనేసింది.
Maharashtra Governor: నేను రాజీనామా చేస్తా!.. మహారాష్ట్ర గవర్నర్ ప్రకటన
ఈ నేపథ్యంలో అమ్మాయి తరుఫు కుటుంబ సభ్యులు వరుడు వద్దకు వచ్చి పది రూపాయాల కరెన్సీ నోట్లు మూడు ఇచ్చి లెక్కించమన్నారు. పాపం ఆ వరుడు ఆ చిన్న పరీక్షలో నెగ్గలేకపోయాడు. అతను కరెన్సీ లెక్కించడంలో విఫలమవ్వడంతో అక్కడ ఉన్నవారందూ ఒక్కసారిగా ఆశ్చర్యపడ్డారు. ఆ యువతి మాత్రం నాకు అతను వద్దంటే వద్దని బీష్మించింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. ఆఖరికి పోలీసులు సైతం జోక్యం చేసుకుని ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చి సర్ధి చెప్పేందుకు ప్రయత్నించినా.. పెళ్లికూతురు ససేమిరా అని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేసింది. దీంతో చేసేది లేక వరుడు, అతడి కుటుంబ సభ్యులు అక్కడ నుంచి వెళ్లిపోయారు.
