Kajal : భాషతో సంబంధం లేకుండా దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది కాజల్ అగర్వాల్. అనతి కాలంలోనే భారీ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. పెళ్ళి తర్వాత గ్యాప్ ఇచ్చి, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించిన కాజల్ ప్రస్తుతం మంచి మంచి అఫర్‌లు అందుకుంటుంది. ఇందులో భాగంగా తాజాగా సమాచారం ప్రకారం కాజల్ బాలీవుడ్ మూవీకి పచ్చజెండా ఊపింది .
Read Also:Pawan Kalyan: నా జన్మంతా పిఠాపురం ప్రజలకి రుణపడి ఉంటా..
నటుడు శ్రేయాస్ తల్పాడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ది ఇండియా స్టోరీ’ అనే హింది సినిమాలో కాజల్ నటిస్తోంది. చేతన్ డీకే తెరకెక్కిస్తున్నారు ఈ మూవీ షూటింగ్ ముంబయిలో ప్రారంభమైంది. ఈ విషయాన్ని తెలుపుతూ.. శ్రేయాస్ ఇన్ స్టా వేదికగా ఫోటోలను పంచుకున్నారు ‘ది ఇండియా స్టోరీ’ ప్రయాణం మొదలైంది. మీరు మునుపెన్నడూ చూడని శక్తివంతమైన కథతో రాబోతున్నాం’ అని పోస్ట్ లో తెలిపారు. అయితే ఈ మూవీ స్టోరీ క్రిమిసంహారక మందుల కంపెనీల్లోని కుంభకోణాల చుట్టూ తిరుగుతుందట, త్వరలో మరిన్ని పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంది. సాగర్ బి. షిండే నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also:Game Changer : దట్ ఈజ్ పవర్ ఆఫ్ రామ్ చరణ్.. అక్కడ ‘గేమ్ ఛేంజర్’ ఆల్‌టైమ్ రికార్డు