Site icon NTV Telugu

Greaves Eltra City XTRA: పెట్రోల్ ఖర్చుతో విసిగిపోయారా?.. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ ఆటోపై ఓ లుక్కేయండి.. సింగిల్ ఛార్జ్ తో 170KM రేంజ్

Greaves Eltra City Xtra

Greaves Eltra City Xtra

ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరిగింది. పొల్యూషన్ రహితంగా ఉండడం, ప్రయాణ ఖర్చులు తగ్గడం వంటి కారణాలతో ఈవీల కొనుగోలుకే మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ తన కొత్త ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఆటో ఎల్ట్రా సిటీ ఎక్స్‌ట్రాను భారత్ లో విడుదల చేసింది. ఇటీవల, బెంగళూరు నుంచి రాణిపేట వరకు 324 కి.మీ. దూరాన్ని సింగిల్ ఛార్జ్ తో కవర్ చేయడం ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.

Also Read:Tata Nano: బైకు ధరకే కారు!.. సొంత కారు కల నెరవేర్చుకోవాలనుకునే వారికి టాటా ఓ వరం

గ్రీవ్స్ ఎల్ట్రా సిటీ XTRA అధునాతన, భద్రతకు సంబంధించిన ఫీచర్లతో వస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు మరింత భద్రత కోసం దీనికి రీన్ఫోర్స్డ్ సైడ్ ప్యానెల్‌లు, ప్రయాణీకుల గోప్యత, భద్రత కోసం రియర్ వ్యూ లేకుండా రూపొందించారు. మెరుగైన స్థిరత్వం కోసం 12-అంగుళాల రేడియల్ ట్యూబ్‌లెస్ టైర్లు, బిగ్ గ్రౌండ్ క్లియరెన్స్, తాజా లుక్‌తో పాటు 180mm పెద్ద బ్రేక్ డ్రమ్‌లు అందించారు. గ్రీవ్స్ ఎల్ట్రా సిటీ XTRA 6.2-అంగుళాల PMVA డిజిటల్ క్లస్టర్‌ను కలిగి ఉంది. ఇది డిస్టెన్స్-టు-ఎంప్టీ (DTE), నావిగేషన్ అసిస్ట్ మొదలైన రియల్-టైమ్ డేటాను అందిస్తుంది. ఇది డ్రైవర్-ఫ్రెండ్లీ డ్యాష్‌బోర్డ్ డిజైన్‌తో పాటు రైడర్, డ్రైవర్ కోసం స్మార్ట్ ఆప్షన్స్, భద్రత కోసం స్మార్ట్ కనెక్ట్ చేయబడిన లక్షణాలను కలిగి ఉంది.

Also Read:Operation Rakshak: హైకోర్టు కీలక తీర్పు.. అలాంటి సందర్భంలో కూడా సైనికుడికి అమరవీరుడి హోదా లభిస్తుంది..

గ్రీవ్స్ ఎల్ట్రా సిటీ XTRA 10.75 kWh IP67-రేటెడ్ LFP బ్యాటరీని కలిగి ఉంది. పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత, ఈ బ్యాటరీ 170 కి.మీ దూరం (డ్రైవర్ + 3 ప్రయాణీకులు) ప్రయాణించగలదు. దీనిలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటారు 9.5 kW శక్తిని ఉత్పత్తి చేస్తుంది. పూర్తిగా ఛార్జ్ కావడానికి 4-5 గంటలు పడుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 60 కి.మీ. గ్రీవ్స్ ఎల్ట్రా సిటీ ఎక్స్‌ట్రాను రూ. 3.57 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు విడుదల చేశారు. కంపెనీ బ్యాటరీపై 5 సంవత్సరాలు / 1.2 లక్షల కి.మీ వారంటీని, దానిని కొనుగోలు చేసే కస్టమర్లకు 3 సంవత్సరాలు / 80,000 కి.మీ వాహన వారంటీని అందిస్తోంది.

Exit mobile version